- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియురాలితో ప్రియుడి రాసలీలలు.. సడన్ ఎంట్రీ ఇచ్చిన భర్త.. భయంతో ప్రియుడు ఏం చేశాడంటే?
దిశ, వెబ్‌డెస్క్ : సమాజంలో కొందరు మహిళలు చేస్తున్న పనుల వలన ఇతరుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. తమ సుఖసంతోషాల కోసం అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఫలితంగా కొందరు తమ నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పెళ్లయిన మహిళ తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. చివరకు భర్తను వదిలేసి తన పాపను తీసుకుని ప్రియుడితో జంప్ అయ్యింది. వీరి ఆచూకీని ఎలాగోలా భర్త కనుగొనడంతో ప్రియురాలి భర్తకు దొరక్కుండా ప్రియుడు చేసిన పని వలన తన జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఏకంగా ఐదు అంతస్థుల భవనం మీద నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ప్రతాప్ నగర్‌లో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది.
ప్రతాప్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు బంధువుల అబ్బాయితో వివాహం జరిపించారు. కొంత కాలం భర్తతో హ్యాపీగానే ఉంది. వీరికి ఓ కూతురు. అయితే, పెళ్లికి ముందే ఆ యువతి మొహ్సిన్ అనే వ్యక్తిని ప్రేమించింది. కూతురు పుట్టాక ఆమె ఆలోచన ప్రియుడి వైపు మళ్లింది. ఇద్దరు మళ్లీ కనెక్ట్ అయ్యారు. ఓ రోజు తన కూతురిని తీసుకుని ప్రియుడితో కలిసి జంప్ అయ్యింది. వీరిద్దరూ యూపీని వదిలి రాజస్థాన్‌లోని జైపూర్‌కు పారిపోయారు. అక్కడే ప్రతాప్ నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కూతురితో పాటు కనిపించకుండా పోయిన భార్య కోసం భర్త వెతుకులాట ప్రారంభించాడు.
చివరకు తన భార్య జైపూర్‌లోని ప్రతాప్ నగర్‌లో ఉన్నట్టు తెలుసుకున్నాడు. తీరా అక్కడకు వెళ్లగా అప్పటికే తన భార్య ప్రియుడితో రాసలీలల్లో మునిగి తేలుతోంది. తన భర్త వచ్చాడని విషయం తెలుసుకుని ప్రియుడికి చెప్పడంతో అతను భయాందోళనకు గురయ్యాడు. ఎలాగోలా అతనికి దొరకకుండా తప్పించుకోవాలని భావించి ఏకంగా ఐదు అంతస్థుల భవనం పై నుంచి దూకాడు. తీవ్రగాయాల పాలైన అతన్ని ఎస్ఎంఎస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి మృతి చెందాడని స్టేషన్ హౌస్ ఆఫీసర్ బల్వీర్ సింగ్ తెలిపారు. ఇదిలాఉండగా, ప్రియుడు ఆస్పత్రి చికిత్స పొందుతున్న సమయం నుంచే భర్తతో పాటు ఆమె అదృశ్యమైంది. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. మృతుడి డెడ్‌బాడీని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.