- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఏం చేశాడంటే.?
దిశ, మోత్కూరు : భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదన్న మనస్థాపంతో భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల రమేష్ (32)కు, పొడిచేడు గ్రామానికి చెందిన మంజులతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
సుమారు 8 ఏళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా.. గొడవల కారణంగా రెండు నెలల క్రితం భార్య మంజుల పిల్లలను తీసుకుని పొడిచేడులోని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో, భార్య కాపురానికి రావడం లేదన్న మనస్థాపంతో రమేష్ మూడు రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి చెల్లెలు ముక్కెర్ల చైతన్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ జి.ఉదయ్ కిరణ్ తెలిపారు. మృతుడి కుటుంబానికి దత్తప్పగూడెం ఎంపీటీసీ ఆకారం లక్ష్మణాచారి 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.