భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసిన భర్త.. క్లిప్ షేర్ చేసి..

by Anukaran |   ( Updated:2021-08-22 01:31:20.0  )
భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసిన భర్త.. క్లిప్ షేర్ చేసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : కట్టుకున్న భర్తే.. భార్య పాలిట శత్రువయ్యాడు. డబ్బు కోసం దారుణానికి ఒడిగట్టాడు. భార్య బాత్ రూంలో స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియోలు తీసి చిత్రవధకు గురిచేశాడు. తీరా విషయం తెలుసుకున్న భార్య ఏం చేసిందంటే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన మోహ్వానా అనే వ్యక్తి తన భార్యకు తెలియకుండా.. బాత్‌రూంకి చిన్న కన్నం పెట్టాడు. ఆ కన్నం గుండా ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోని ఆమె బావకు పంపాడు. ఆ వీడియో చూసిన అతను.. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మెహ్వానాకు తెలియకుండా.. ఓ రోజు ఆమె ఇంటికి వచ్చాడు. సదరు మహిళపై అత్యాచారం చేయబోయాడు. ఆమె అడ్డుకోవడంతో.. తాను స్నానం చేస్తున్న వీడియో చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. తనకు సహకరించకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దాంతో ఆమె నిస్సహాయురాలైంది.

సదరు మహిళ భర్త ఇలా ఎందుకు చేశాడంటే..

తన భార్యకు తెలియకుండా మెహ్వానా అదే ఇంట్లో సీక్రెట్‌ కెమెరాలు అమర్చాడు. ఆమె బావ కోసమే అతను అవి అమర్చాడు. ఎప్పటి నుంచో ఆమె బావకు ఆమెపై గురి ఉంది. ఆ విషయం మెహ్వానాకు తెలుసు. కాబట్టి.. అతనికి స్నానం వీడియోను ఎరగా వేశాడు. మెహ్వానా ఇంట్లో సీక్రెట్ కెమెరాలో ఉండటంతో మహిళపై అత్యాచారం చేసిన వీడియో సీసీ ఫుటేజీలో రికార్డు అయింది.

ఆ ఫుటేజ్‌లో ఓ క్లిప్‌ను తిరిగి ఆమె బావకు పంపిన మెహ్వానా.. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. షాకైన అతను.. తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. అలాగైతే.. ఆ వీడియోను నెట్‌లో పెడతానని మెహ్వానా బెదిరించాడు. ఈ క్రమంలో సదరు బాధితుడికి ఏం చేయాలో తోచలేదు. అయితే అతడి(బావ) భార్య ధనిక కుటుంబానికి చెందిన మహిళ. ఈ విషయం ఆమెకు తెలిస్తే వెంటనే ఇచ్చేసే టైపు కావడంతో అతను టెన్షన్‌కు గురయ్యాడు.

ఇంతలో మెహ్వానా భార్యకు ఈ స్టోరి మొత్తం తెలిసింది. తీవ్ర ఆగ్రహంతో తనకు వేధించిన ఇద్దరిపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందగా సదరు మహిళ భర్తను అరెస్ట్ చేశారు. ఇంతలో మహిళకు ఏం చేయాలో తోచకపోవడంతో అతను తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో తనను రూ.30 లక్షల కోసం బ్లాక్‌మెయిల్ చెయ్యడం వల్లే సూసైడ్ చేసుకుంటున్నానని రాయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed