- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడికి 64, ఆమెకు 55.. పైశాచికత్వంతో ఆమె ప్రైవేటు పార్ట్స్‌పై..
దిశ, వెబ్‌డెస్క్ : వారిద్దరూ భార్యాభర్తలు. ఎన్నో ఏళ్ల దాంపత్య జీవితం వారిది. కానీ, వారి మధ్య అనుమానం అనే పెనుభూతం దరిచేరడంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై అనుమానంతో ఏ భర్త చేయకూడని విధంగా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.
అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. చివరకు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. చిత్రహింసలు భరించలేక సదరు మహిళ ఓ పోలీసు అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. సింగ్రౌలి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి(64) తన భార్య(55)కు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఓ రోజు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. భర్త చిత్రహింసలను భరించలేక.. ఆ మహిళ పోలీసు అధికారిని ఆశ్రయించింది. దీంతో పోలీసులు మహిళను ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కేంద్రానికి తరలించారు.
ఈ సందర్బంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు మహిళ ప్రైవేటు భాగాల్లో దాడి చేసేందుకు సూది, దారాన్ని ఉపయోగించాడని తెలిపారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక, నిందితుడిపై శారీరక, మానసిన వేధింపులతో పాటు సంబంధిత సెక్షన్ల కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఇటీవలి కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.