నా భర్త నన్ను చేరదీసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటున్నా భార్యా..

by Shyam |   ( Updated:2021-12-22 07:01:05.0  )
నా భర్త నన్ను చేరదీసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటున్నా భార్యా..
X

దిశ, అల్వాల్: పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు కావస్తున్నా కాపురానికి తీసుకుని పోకుండా తన భర్త మామిడి సందీప్​రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మామిడి శ్రీలత రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం లోతుకుంటలోని సందీప్ రెడ్డి ఇంటి ముందు ఆమె ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తేదీ 25-04-2012 న సుచిత్ర గోదావరి హోమ్ కు చెందిన బైరెడ్డి రాంరెడ్డి కూతురు శ్రీలత రెడ్డి ని అల్వాల్​సర్కిల్​ లోతుకుంట కు చెందిన మామిడి ప్రతాప్​రెడ్డి కుమారుడు సందీప్ ​రెడ్డి కి ఇచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో పది లక్షల నగదుతో పాటు 50 తులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలు ముట్ట చెప్పారు.

పెళ్లి అయిన తర్వాత నెల రోజులు మాత్రమే అత్తవారి ఇంట్లో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను అక్కడ ఉన్నన్ని రోజులు నిత్యం భర్త సందీప్​రెడ్డి, అలాగే అత్త వేధింపులతో నరకం అనుభవించానని తెలిపారు. ఒక రోజు అదును చూసుకొని ఇంటి నుంచి నెట్టివేసి తలుపు పెట్టుకున్నారని శ్రీలత రెడ్డి ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఇంట్లో అడుగు పెట్టనీయడం లేదని వాపోయారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు ఇంటికి రావడానికి ప్రయత్నం చేశానని అయినా ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి ముందు ధర్నా కు కుర్చున్నానని మామిడి శ్రీలత రెడ్డి తెలిపారు. నా భర్త నన్ను చేరదీసే వరకు నాకు న్యాయం జరిగే వరకు ఇలాగే ఉంటానని శ్రీలత రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story