లాడ్జిలో జవాన్‌ రాసలీలలు.. నగ్న వీడియోలు వైరల్ చేసిన భార్య

by Anukaran |   ( Updated:2023-05-19 10:56:16.0  )
లాడ్జిలో జవాన్‌ రాసలీలలు.. నగ్న వీడియోలు వైరల్ చేసిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలలో చిచ్చుపెడుతున్నాయి. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. వీటివలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వేరే వారి మోజులో కుటుంబ బంధాలను రోడ్డుకీడుస్తున్నారు. తాజాగా ఒక భార్య.. తన భర్త వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంది. అంతేకాకుండా అలాంటి తప్పు మళ్లీ చేయకుండా గట్టిగా బుద్దిచెప్పింది. భర్త తన ప్రేయసితో లాడ్జిలో నగ్నంగా ఉన్న సమయంలో వారి నగ్న వీడియోలను తీసి నెట్టింట వైరల్ చేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ తన భార్యతో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. టీచర్ అయిన ఆమె రోజు స్కూల్ కి వెళ్తుండేది. ఇక ఈ క్రమంలోనే జవాన్‌ కు ఒక ప్రేయసి ఉంది. రోజు భార్య స్కూల్ కి వెళ్ళగానే ప్రేయసి తో ఫోన్ మాట్లాడుతుండేవాడు. అలా నడుస్తున్న క్రమంలో భార్యకు, భర్తపై అనుమానం వచ్చింది. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని అనుమానించిన భార్య అతనిపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే భర్త ఫోన్‌లో మాట్లాడుతూ.. పలానా చోటకు రమ్మని తన ప్రేయసికి చెప్పడం భార్య విన్నది. భర్త వెళ్లిన కాసేపటికి ఆమె కూడా భర్తను ఫాలో అవుతూ వెళ్లింది.

లాడ్జిలో ప్రేయసితో భర్త ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె అక్కడికి వెళ్లి ఆ దృశ్యాలను వీడియో తీసి గది బయట తాళం వేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల సాయంతో తాళం తెరచి చూడగా భర్త, అతడి ప్రేయసి నగ్నంగా కనిపించారు. ఆ తర్వాత ఆ వీడియోలను తమ బంధువులకు పంపడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇక ఆ వీడియోల వలన తన పరువు పోయిందని భర్త ప్రేయసి, అతని భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed