- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నలుగురిని పెళ్లాడిన లేడి కానిస్టేబుల్.. టార్చర్ భరించలేక నాలుగో భర్త..!
దిశ, వెబ్‌డెస్క్ : మగ మహారాజులకు మేము ఏమాత్రం తక్కువ కాదని కొందరు నారీమణులు ప్రూవ్ చేస్తున్నారు. ఒకప్పుడు మగవాళ్లు ఇద్దరు లేక ముగ్గురిని పెళ్లాడినా ఎవరూ ప్రశ్నించేవారు కాదు. ప్రస్తుతం అదే ట్రెండ్‌ను మగువలు సైతం ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మగవాళ్లు చేసుకుంటే తప్పులేనపుడు తమకు ఎందుకు ఈ రూల్స్ వర్తించాలి అనుకున్నారేమో..? కట్టుబాట్లు అన్నింటినీ పక్కన పెట్టేసి ఓ మహిళా ఉద్యోగి తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్లింది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లాడింది. చివరకు ఆమె టార్చర్ భరించలేక మూడో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతబాద్‌లో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి హనీ ట్రాప్ పథక రచన చేసింది. డబ్బులున్న వారిని ప్రేమపేరుతో ట్రాప్ చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడమే కాకుండా విడాకులు తీసుకుంది. ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె తాజాగా మరొకరిని ప్రేమపేరుతో బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంది. విషయం తెలుసుకున్న చరణ్ తేజ షాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. సంధ్యారాణి టార్చర్ తీవ్రతరం కావడంతో బాధిత వ్యక్తి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంధ్యారాణి నిజస్వరూపం తెలియడంతో ఆమె వరుస వివాహాలపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో బాధిత పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.