ఆమెను అంతం చేయాలని..

by Anukaran |   ( Updated:2020-09-08 11:23:17.0  )
ఆమెను అంతం చేయాలని..
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో భార్యను కత్తితో నరికిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. ఫుల్‌గా మందేసి వచ్చిన భర్త-భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే మాటకు మాట పెరగడంతో కత్తితో దాడి చేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా, బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

వివరాళ్లోకి వెళితే.. కుప్పం సరిహద్దు ఏరియాలో శాంతాబాయి-భీమారావు దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, తరచూ భార్యభర్తల మధ్య గొడవలు అయ్యేవి. దీంతో పాటు భార్య పై అనుమానం పెంచుకున్న భర్త భీమారావు నిత్యం తాగి వచ్చి గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఫుల్ గా తాగాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి భార్యతో గొడవ పడి.. కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు రక్తపు మడుగులో ఉన్న శాంతాబాయిని స్థానిక కోలార్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

Advertisement

Next Story