- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంటను కాపాడబోయి.. పిడుగుపాటుకు బలైన దంపతులు
దిశ, నారాయణఖేడ్ : పిడుగుపాటుకు భార్య భర్తలు మృతిచెందిన దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాద ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం మనూర్ తండాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వర్ష సూచన నేపథ్యంలో నుర్పిడి చేసిన జొన్న పంటను కాపాడుకునేందుకు దానిపై టార్పాలిన్ కప్పేందుకని లంబాడా దంపతులిద్దరూ తమ ముగ్గురు పిల్లలను ఇంట్లోనే వదిలి పొలం వద్దకు వెళ్లారు.
కాగా గురువారం ఉదయం పొలాలకు వచ్చిన పొరుగు రైతులు పంట కుప్పపై దంపతులిద్దరూ విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. పిడుగుపాటుకు భార్యభర్తలు కిషన్ నాయక్(45), కొమిని బాయి(39) మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఏకకాలంలో తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలైన చిన్నారుల పరిస్థితిని చూసి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.