విషాదంలో క్రీడా లోకం.. కరోనాతో ఒలింపిక్స్ ఛాంపియన్ మృతి

by vinod kumar |   ( Updated:2021-04-11 04:13:28.0  )
విషాదంలో క్రీడా లోకం.. కరోనాతో ఒలింపిక్స్ ఛాంపియన్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటీవరకు ఎంతమంది ప్రముఖులను కరోనా పొట్టనపెట్టుకుంది. తాజాగా ఒలింపిక్స్ ఛాంపియన్ కరోనా కారణంగా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, నాలుగుసార్లు వరల్డ్‌ చాంపియన్, ఆరుసార్లు యూరోపియన్‌ చాంపియన్‌ అయిన హంగేరి మహిళా షూటర్‌ డయానా ఇగాలేను కరోనా మహమ్మారి కబళించింది. ఈ విషాద ఘటనతో క్రీడా లోకంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె మంగళవారం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే శుక్రవారం ఆమె మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed