- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఊరిలో ఒకేరోజు వందమందికి పాజిటివ్.. వణికిపోతున్న జనం
దిశ రాజేంద్రనగర్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. తాజాగా.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఒకేరోజు వందమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతేగాకుండా.. వైరస్ బారినపడి ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు, గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కౌన్సిలర్ చెన్నం అశోక్ తెలిపారు. నిత్యావసర సరుకుల కోసం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు సడలింపులు ఇచ్చారు. దీనిని అతిక్రమించి ఎవరు బయట తిరిగినా రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. నిత్యావసర సరుకుల కోసం బయటికి వచ్చినప్పుడు తప్పకుండా, శానిటైజర్, మాస్కు, భౌతికదూరం పాటించాలని సూచనలు చేశారు.