మానవ మలం నుంచి విద్యుత్పత్తి

by Shyam |
మానవ మలం నుంచి విద్యుత్పత్తి
X

దిశ, ఫీచర్స్ : మానవ మూత్రం నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కోళ్లు, మనుషుల మలం నుంచి కూడా పవర్ జనరేషన్ సాధ్యం కావచ్చు. ఇజ్రాయెల్‌లోని బెన్-గురియన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల మానవ మలం నుంచి శక్తిని ఉత్పత్తి చేసేందుకు ఫీల్డ్ లావెటరీని ఏర్పాటు చేశారు.

పౌల్ట్రీ వ్యర్థాలతో పరిశోధన చేసిన పరిశోధకులు ఆ తర్వాత మానవ పూప్‌తో ప్రయోగాలు చేసింది. మలాన్ని ఆటోక్లేవ్‌లలో వేడి చేసి సూక్ష్మక్రిములను తటస్థీకరించి, పొడి రూపంలోకి తీసుకొస్తారు. దీనికి నీళ్లను కలిపి చిన్న ఇటుకలుగా రూపొందించి, ఆపై అధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద 50 మిల్లీలీటర్ ల్యాబ్ రియాక్టర్‌లలోకి లోడ్ చేస్తారు. వాటిని 180 డిగ్రీల సెల్సియస్ నుండి 240 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య బాయిల్ చేస్తూ ఆయా టెంపరేచర్స్‌లో జరిగే చర్యలను పరిశీలించారు. ఈ ప్రక్రియను HTC లేదా హైడ్రో థర్మల్ కార్బొనైజేషన్ అంటారు. ఇది హైడ్రోచార్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హైడ్రోచార్‌ను ఎలా ఉపయోగించవచ్చు?

హైడ్రోచార్‌ను దాని దహన లక్షణాల ఆధారంగా బొగ్గు లాగా ఉపయోగించవచ్చు లేదా బొగ్గుతో నడిచే విద్యుత్ ప్లాంట్‌కు ఇండస్ట్రియల్ ఫర్నేస్‌కు అందించవచ్చు. ఇక కోళ్ల విసర్జితాలతో ప్రయోగం చేయగా అందులోని ఫైనల్ ప్రోడక్ట్ లిట్టర్ కార్బన్, నైట్రోజన్‌తో నిండి ఉంటుంది. ఇవి శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరం. ఇక్కడ కూడా హెచ్‌టీసీ ప్రక్రియను అనుసరించి, హైడ్రోచార్ సృష్టిస్తారు.

శిలాజ ఇంధనాల ఒత్తిడిని తగ్గించడానికి పరిశ్రమ ఉత్పత్తిలో ఉపయోగించే మొత్తం బొగ్గులో 10 శాతాన్ని పౌల్ట్రీ పేడ భర్తీ చేయగలదని బృందం అంచనా వేసింది. అయినప్పటికీ, శక్తి ఉత్పత్తి పరంగా మానవ మలం మరింత ప్రభావవంతంగా ఉన్నట్లు బృందం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed