ఏపీ-తెలంగాణ సరిహద్దులో భారీ బంగారం పట్టివేత

by srinivas |   ( Updated:2021-06-12 06:26:32.0  )
gold-kurnool-1
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అక్రమ రవాణా దారులు రెచ్చిపోతున్నారు. దేశమంతా కొవిడ్ మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతుంటే వారు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తమ పనిచేసుకుంటూ పోతున్నారు. అందుకోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ-తెలంగాణ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది.

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ వాహనంలో రూ.1.08 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కిలో 818 గ్రాముల బంగారం వస్తువులను గుర్తించి వివరాలు అడగ్గా, వారు నుంచి ఏ సరైన పేపర్లు, సమాధానం లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలుకు బంగారాన్ని తరలిస్తున్నట్లు తేలింది.

Advertisement

Next Story

Most Viewed