- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంబులెన్సులకు మంగళం.. 167 మండలాల్లో దేవుడే దిక్కు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పేషెంట్లను ఆసుపత్రులకు తరలించే ‘108 అంబులెన్స్’ల కొరత ఏర్పడింది. పెరిగిన రోగాలు, జనసాంద్రత ప్రకారం మండలానికో అంబులెన్స్అవసరమని నిపుణులు సూచిస్తుండగా, ప్రస్తుతం కేవలం 426 మాత్రమే ఉన్నాయి. అంటే మరో 167 మండలాలకు వాహనాలు లేవు. అందుబాటులోఉన్న వాటితోనే ఆయా మండలాల్లోనూ సేవలను నెట్టుకొస్తున్నారు. మరోవైపు 426 వాహనాల్లో 149 పాతవి కావడంతో రోడ్లపై తిరిగే కండీషన్‌లో లేవని స్వయంగా 108 నిర్వహుకులు చెబుతున్నారు. అంతేగాక అత్యవసర సమయాల్లో ప్రాణ రక్షణ కోసం వైద్యం అందించేందుకు అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన సౌకర్యాలు కేవలం 30 వాహనాల్లోనే ఉన్నాయి. పైగా ‘గిప్ట్ఏ స్మైల్’ ద్వారా వైద్యశాఖకు వచ్చిన 103 అన్ని వాహనాల్లోనూ అడ్వాన్స్ డ్ లైఫ్ సపోర్టు(ఏఎల్ఎస్) విధానం లేకపోవడం గమనార్హం. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని కేటీఆర్ బర్త్ డే సందర్భంగా షురూ చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్సులు ఇవ్వాలని గతంలో మంత్రి కేటీఆర్పిలుపునిచ్చారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తలా ఓ ఐదారు చొప్పున అంబులెన్సులను అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. కానీ, 426లో కేవలం 30 వాహనాల్లోనే అత్యాధునిక లైఫ్సపోర్టు సౌకర్యాలు ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.
35 శాతం మండలాలకు లేవ్
రాష్ట్ర వ్యాప్తంగా 593 మండలాలు ఉండగా, వీటిలో 35 శాతం మండలాలకు పూర్తిస్థాయిలో 108 వాహనాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే ఆయా మండలాల వైద్యాధికారులు అంబులెన్సులకు కల్పించాలని సర్కార్‌ను కోరినా, స్పందన లేదని చెప్పుకొస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఉన్న వాటితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తద్వారా రోగులకు సకాలంలో ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారిందని డాక్టర్లు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉన్నదంటున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉంటే 6 అంబులెన్సు లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు జనగామ జిల్లాలో 13 మండలాలు ఉండగా 7, భూపాలపల్లిలో 20 మండలాలకు 8, గద్వాలలో 12 మండలాలకు 6, ఖమ్మంలో 21 మండలాలకు 14, మహబూబ్‌నగర్‌లో 26 మండలాలకు 15, నారాయణపేట్‌లో 11 మండలాలకు 5, నిర్మల్‌లో 19 మండలాలకు 8, పెద్దపల్లిలో 14 మండలాలకు 8, సిరిసిల్లలో 13 మండలాలకు 9, వికారాబాద్‌లో 18 మండలాలకు 11, వనపర్తిలో 14 మండలాలలకు కేవలం 7 అంబులెన్సులు మాత్రమే తిరుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో అత్యవసర పేషెంట్లను ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు.
గంటలు గడిచినా..
అంబులెన్సుల నిర్వాహణపై రాష్ట్ర ప్రభుత్వ, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. యాక్సిడెంట్లు, ఇతర అత్యవసర సమయాల్లో కేవలం 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాల్సిన అంబులెన్స్‌లు, గంటలు గడిచినా రావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రైవేటు వాహనాల్లో బాధితులను తరలించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చాలామంది సకాలంలో వైద్యం అందక మార్గంమధ్యలోనే చనిపోతున్నట్లు కొందరు అంబులెన్సు డ్రైవర్లు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు.
ట్రాఫిక్నియంత్రణపై కూడా దృష్టి పెట్టాలి : డాక్టర్ రమేష్, మెడికల్ జేఏసీ చైర్మన్
అంబులెన్సులు సకాలంలో ఆసుపత్రులకు చేరేందుకు ట్రాఫిక్‌నియంత్రణ కూడా అవసరం. హైదరాబాద్‌లో మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంబులెన్సుల ట్రాఫిక్ క్లియర్‌కు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఎమర్జెన్సీ పేషెంట్లకు ఇబ్బందులు వస్తాయి. దీంతో పాటు ప్రతీ రోజు అత్యవసర కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంబులెన్సుల సంఖ్య పెంచాలి. వాటిలోనూ లైఫ్ సపోర్టు సౌకర్యాలు కల్పించాలి. అంతేగాక 108 విభాగాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించాలి. దీంతోపాటు పాత వాహనాల స్థానంలో కొత్తవి తీసుకురావాలి. అంతేగాక అన్ని వెహికల్స్‌లో టెక్నీషియన్లు ఉండేలా చూడాలి. లేకపోతే చాలామంది ప్రాణాలు విషమ పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నది.