టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ షాక్ ఇచ్చిన ప్రజలు.!

by Shyam |
Challa-Dharma-reddy
X

దిశ, పరకాల : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అఖిలపక్ష నేతలతో శనివారం జరిపిన చర్చలు విఫలమైనట్లేనా అనే చర్చ పరకాలలో విస్తృతంగా సాగుతోంది. పరకాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జిల్లా సాధన ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం అఖిలపక్ష నేతలతో చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా జిల్లా పోరుకు ముగింపు పలికినట్లేనని అంతా అనుకున్నారు.

కానీ, అనుహ్యంగా అందుకు భిన్నంగా ఆదివారం పరకాల వరంగల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో.. అఖిలపక్ష నేతలు గౌడ కులస్తులను కలిశారు. అనంతరం జిల్లా సాధన ర్యాలీ చేపట్టడం కోసం అమరవీరుల మైదానం వద్ద బారి సమీకరణాలు జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే జరిపిన మంతనాలు విఫలం అయినట్లేనా..? అనే చర్చ పరకాల ప్రాంతంలో జోరందుకుంది.

Advertisement

Next Story