- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ-కథాస్రవంతి’ కథల పోటీలకు భారీ స్పందన.. విజేతలకు బహుమతులు..
దిశ, తెలంగాణ బ్యూరో : కవులు, రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ‘దిశ-కథాస్రవంతి’ పేరిట తాము కథల పోటీ నిర్వహించామని ‘దిశ’ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు అన్నారు. పోటీల విజేతలకు ఆయన హైదరాబాద్‌లోని పత్రిక కార్యాలయంలో శనివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చేసిన చిరు ప్రయత్నానికి భారీ స్పందన రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ‘దిశ’ డిజిటల్ పేపర్, వెబ్‌సైట్ అనూహ్య విజయం సాధించిందని అన్నారు.
కవులు, రచయితలు, కళాకారులు కూడా తమకు అండగా నిలవడం ఆనందకర విషయమని అన్నారు. ఎడిటర్ డి. మార్కండేయ మాట్లాడుతూ.. ఏడాదిన్నర చిన్న వయసులోనే తాము పెద్ద పత్రికల సరసన చేరామని అన్నారు. పాఠకుల అభిరుచి, అన్నివర్గాలవారి అండ ఇందుకు కారణమని పేర్కొన్నారు. ‘దిశ’ సాహితీ పేజీకి కూడా మంచి ఆదరణ లభించిందని, కవులు, రచయితల సహకారంతో దీనిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సాహితీ సౌరభం బాధ్యులు ఫజుల్ రహమాన్ మాట్లాడుతూ పోటీకి వచ్చినవాటిలో చాలా కథలు బాగున్నాయని అన్నారు. బహుమతి పొందిన కథలను గుర్తించి, వాటిని ఎంపిక చేయడానికి గల కారణాలేమిటో వివరించారు.
ప్రథమ బహుమతి పొందిన ‘బిచ్చగాడు’ కథా రచయిత ముసునూరి సుబ్బయ్య మాట్లాడుతూ సాహితీకారులను ఆదరించడానికి ఇపుడు శ్రీకృష్ణదేవరాయలు లేరని, రచయితలను ప్రోత్పహిస్తున్న పత్రికా నిర్వాహకులే తమకు శ్రీకృష్ణదేవరాయలు అని అన్నారు. అప్పాజీల కృషి ఎంతగా ఉన్నా శ్రీకృష్ణదేవరాయలు అండ, సహకారం ఉండాల్సిందేనని పేర్కొన్నారు. రచయిత్రి వాసవత్త రమణ మాట్లాడుతూ నిర్వాహకులు కథలలో లీనం కావడం తమకు సంతోషం కలిగించిందని అన్నారు.
ఇలాంటి ప్రోత్సాహం రచయితలు, రచయిత్రులకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. మరో రచయిత్రి జయంతి వాసరచెట్ల మాట్లాడుతూ ‘దిశ’ కథల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ‘దిశ’ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేశ్, ఐటీ ఇన్‌చార్జి అనుకరణ్ తదితరులు పాల్గొన్నారు.