- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో చచ్చినా ‘చావే’.. మృతుల అంత్యక్రియలకు భారీ బడ్జెట్
దిశ, తెలంగాణ బ్యూరో : ఓ వైపు కరోనా కాటేస్తుంటే.. శవాలను దహనం చేసేందుకు కూడా పట్టి పీడిస్తున్నారు. కరోనాతో మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కరోనా బారిన పడితే ఆర్థికంగా చితికిపోవాల్సి వస్తోంది. కరోనాకు చికిత్స పొందుతూ చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి ఖర్చు తడిచి మోపెడు అవుతోంది. చావులో సైతం కాసులు దండుకుంటున్నారు.
శ్మశాన వాటికల్లో పాత ధరల ప్రకారమే దహనం చేస్తున్నా.. వాటిని తరలించడంలో మాత్రం భారీగా వసూళ్లు చేస్తున్నారు. ఇక సెల్ఫ్ ఐసోలేషన్‌లో చనిపోతే అంత్యక్రియలు చేయడం కోసం వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల ఎర్రగడ్డలో ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోగా.. రూ.25 వేల చొప్పున అంత్యక్రియలు నిర్వహించే సిబ్బంది రూ.50 వేలు వసూలు చేశారంటూ ఇటీవల జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. పేదలనేది కూడా పట్టించుకోకుండా అంత్యక్రియలు నిర్వహించడంలోనూ కాసులు దండుకుంటున్నారు.
శ్మశాన వాటికల్లో రూ. 8 వేలే..
దహనం చేయడానికి కట్టెలు, ఇంధనం, దహన సంస్కారాలను పూర్తి చేసేందుకు శ్మశాన వాటికలకు చెల్లించేది మాత్రం పాత తరహాలోగా రూ. 8 వేలు చెల్లిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తి చేయడానికి కట్టెలు, ఇంధనం కోసం తక్కువగా తీసుకుంటున్నా తరలించేందుకు తీసుకునే సొమ్ము మాత్రం మూడింతలుగా ఉంటోంది. ఒక్కో డెడ్‌బాడీకి దాదాపు 60 టన్నుల కట్టెలను వాడుతున్నారు. కట్టెలను ఏపీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని శ్మశాన వాటికల్లో రూ. 8 వేలు తీసుకుంటున్నా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ. 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించినందుకు డబ్బులు తీసుకొని రశీదు కూడా ఇవ్వడం లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి అయిన వారు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు దు:ఖంలో మునిగిపోతే.. వారి మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తడిసిమోపడవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ నుంచే వసూళ్ల దందా
“ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఓ రోగి మృతి చెందాడు. విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు ఆస్పత్రి వర్గాలు చేరవేశాయి. నిబంధనల ప్రకారం.. అంత్యక్రియలను జరిపించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులకు కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేశారు. వాళ్లేమో మృతదేహం తీసుకెళ్లేందుకు మరుసటి రోజు ఉదయం వచ్చారు. ఎప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడు రావడం ఏమిటి? అని మృతుడి కుటుంబీకులు ప్రశ్నిస్తే.. అంత్యక్రియల కోసం ఎన్నో మృతదేహాలు ఉన్నాయని, అందుకే ఆలస్యమైందంటూ వారే బుకాయించారు. వచ్చిన తర్వాత రూ. 30 వేలు ఇస్తేనే శవాన్ని తీసుకుపోతామంటూ తెగేసి చెప్పారు.” ఇవి కేవలం దహన సంస్కారాలకే.
అంబులెన్స్‌కు మళ్లీ రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ఇవ్వాల్సిందే. దవఖానాలు, హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారిలో ఎవరైనా మృతి చెందితే నిబంధనల ప్రకారం దహన సంస్కారాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఇటీవల పాజిటివ్‌లతో పాటు కరోనా అనుమానితుల మృతుల సంఖ్యా పెరుగుతోంది. ఈ తరహా మృతులను అధికారికంగా లెక్కల్లో చూపకపోయినా నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో శ్మశానాలకు కొరత ఏర్పడటంతో అంత్యక్రియల నిర్వహణ ప్రక్రియ అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో శవాలను తరలించడం, దహన సంస్కారాల కోసం ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 900 వరకూ శ్మశాన వాటికలు ఉండగా.. కొన్నింట మాత్రమే కరోనా మృతులను దహనం చేస్తున్నారు.
మీరు రావద్దు.. డబ్బు చెల్లిస్తే చాలు
కరోనాతో చనిపోతే నిబంధనల ప్రకారం ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. చివరి చూపునకు నలుగురికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రతి శ్మశానంలో రోజూ 30 నుంచి 40 మృతదేహాలు కరోనా మృతులే. ఇటీవల ఎక్కువగా అంబర్‌పేట, హయత్‌నగర్, బాలాపూర్ మండలంలోని మల్లాపూర్, కవాడిగూడ, రెయిన్ బజార్ తదితర ప్రాంతాల్లోని ఖబరస్థాన్‌లో అంత్యక్రియలు చేస్తున్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలోని అంత్యక్రియలను ఎక్కువగా ఈఎస్ఐ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి శ్మశాన వాటికలో నిర్వహిస్తున్నారు.
అయితే గాంధీ, చెస్ట్, ఉస్మానియా, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో మరణించిన వారి అంత్యక్రియలకయ్యే ఖర్చును జీహెచ్‌ఎంసీ భరిస్తున్నట్లు చెప్పుతున్నా.. మృతుల బంధువుల నుంచే వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి కూడా అంబులెన్స్, బాడీ హ్యాంగర్స్, కట్టెలు, దహనం, అనంతరం అస్తికలు భద్రపర్చడం వరకు అంతా ప్యాకేజీగా రూ. 23 వేల వరకు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నట్లు చెప్పుతున్నారు. కానీ మృతుల బంధువుల నుంచి అదనంగా రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నుంచి కూడా మృతదేహాలను తీసుకుపోయి దహనం చేసేందుకు మృతుడి కుటుంబీకుల నుంచే రూ. 30 వేలు తీసుకుంటున్నారు.
బెదిరిస్తున్నారు..
అంత్యక్రియల కోసం ఫోన్లు చేస్తే నేరుగా డబ్బుల విషయమే అడుగుతున్నారు. ఒక్కో డెడ్‌బాడీకి రూ. 30 వేలు ఇవ్వాలని, లేకుంటే ఫోన్‌కట్ చేయాలంటూ చెప్పుతున్నారు. జీహెచ్ఎంసీ తరుపున అంత్యక్రియలు చేస్తున్న సదరు కాంట్రాక్టర్మృతుల కుటుంబీకులతో డిమాండ్‌చేస్తూ మాట్లాడుతున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులున్నా.. కరోనా సమయం కావడంతో ఏం చేయలేకపోతున్నట్లు చెప్పుతున్నారు.