బిగ్ బ్రేకింగ్ : ధూల్‌పేటలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

by Sumithra |   ( Updated:2021-08-10 10:38:54.0  )
dhoolpet
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని పాత బస్తీ పరిధిలో గల ధూల్‌పేటలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అక్రమంగా సిలిండర్ ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నట్టు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసిన పోలీసులు ఈ అక్రమ దందా ఎప్పటి నుంచి నడుస్తు్న్నదనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుళ్లు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed