Ex-minister Srinivas Goud's : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి 14రోజుల రిమాండ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-27 12:30:31.0  )
Ex-minister Srinivas Gouds : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి 14రోజుల రిమాండ్
X

దిశ, అచ్చంపేట : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Ex-minister Srinivas Goud's) తమ్ముడు శ్రీకాంత్ గౌడ్( Srikanth Goud)కు అచ్చంపేట సివిల్ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. మహబూబ్ నగర్ లో క్రిస్టియన్ పల్లి శివారు సర్వే నెంబర్ 523లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, సంతకాలతో ప్లాట్లుగా చేసి విక్రయాలు జరిపిన వ్యవహారంలో మొత్తం నలుగురిపై మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు గత నెల రెండో తేదీన కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా శ్రీకాంత్ గౌడ్ శుక్రవారం పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఆయనను శనివారం అచ్చంపేట కోర్టులో హాజరుపరుచగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో శ్రీకాంత్ గౌడ్ ను మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించారు.

నిందితుల్లోని దేవా, మునగాల శెట్టి, రాముడులను ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. నిందితులు నలుగురిపై 406, 417, 420, 467, 468, 471, 474 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. మహబూబ్ నగర్ మేజిస్ట్రేట్ శిక్షణలో ఉండడంతో అచ్చంపేట మెజిస్ట్రేట్ కు ఇంచార్జీ ఇవ్వడం వలన అచ్చంపేట సివిల్ కోర్టు ముందు శ్రీకాంత్ గౌడ్ ను హాజరు పరిచినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed