- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటికైనా అపోహలను వదిలేయండి : హృతిక్
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్ 19 వ్యాధి నుంచి కోలుకున్న హృషి గిరిధర్ అనే రోగి తన అనుభవాన్ని పంచుకోవడంపై అభినందించారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక సోషల్ మీడియాలో ప్రజలతో తన అనుభవాన్ని పంచుకున్న మొదటి వ్యక్తి హృషి గిరిధర్ అన్న హృతిక్.. తన పోస్ట్‌తో అపోహలకు చెక్ పెట్టారని తెలిపారు. కరోనా పాజిటివ్‌తో హాస్పిటల్‌లో చేరితే ఎలా ఉంటుందోననే పుకార్లకు స్వస్తి పలికాడన్నారు. హెల్త్ కేర్ కమ్యూనిటీ గురించి భగవంతున్ని ప్రార్థిస్తానని … చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు హృతిక్.
Covid-19 patient Hrishi Giridhar shares a first person account of his health post contracting Coronavirus & welfare provided by Mumbai’s Kasturba Hospital.
It is imperative to bust myths & stay away from rumors.Godspeed Hrishi🙏🏻
My prayers & pride with the health care community pic.twitter.com/d3WkgubWjH— Hrithik Roshan (@iHrithik) April 3, 2020
కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా లండన్‌లో చదువుకుంటున్న హృషి గిరిధర్… ముంబైలోని తన ఇంటికి వచ్చేశాడట. రెండు రోజులు బాగానే ఉన్నా.. మూడో రోజు జ్వరం వచ్చిందని తెలిపాడు. తర్వాతి రోజుకు టెంపరేచర్ ఎక్కువైపోయిందట.. కానీ జబ్బు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలేవి లేదని చెప్పాడు. రాత్రి వాంతులు కావడంతో కాస్త అలసటగా అనిపించిందట. ఆ తర్వాత రోజు ఇంటి దగ్గర వాకింగ్ చేస్తుండగా మైకం కమ్మేసి కిందపడిపోగా.. మొహానికి గాయాలై, పన్ను కూడా విరిగిపోయిందట. కానీ ఈ గాయాలకన్నా ముందు కరోనా సంక్రమించిందేమో అనే ఆలోచనతో ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్‌కు టెస్ట్‌కు వెళ్తే.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపాడు హృషి. కానీ డాక్టర్లు, నర్సుల కేరింగ్‌తో నేను నిజంగా మంచి చేతుల్లోనే ఉన్నాను అనే అభిప్రాయం ఏర్పడిందని చెప్పాడు. శుభ్రమైన గదులు, మంచి ఆహారం, సానిటైజర్స్ అందుబాటులో ఉండేవని… డాక్టర్లు ప్రతీ ఒక్కరిని కేరింగ్‌గా చూసుకునే వారని తెలిపాడు. వైద్యులు వారి శక్తిని మించి పనిచేస్తున్నారని.. తనను అంత జాగ్రత్తగా చూసుకున్న హాస్పిటల్ సిబ్బందికి అపారమైన కృతజ్ఞతలు తెలిపారు.
Tags: Hrithik Roshan, Bollywood, CoronaVirus, Covid 19