డ్యాన్సర్లకు హృతిక్ హెల్ప్

by Jakkula Samataha |   ( Updated:2020-07-25 03:13:13.0  )
డ్యాన్సర్లకు హృతిక్ హెల్ప్
X

బాలీవుడ్ గ్రీక్ దేవుడు హృతిక్ రోషన్ ఫిట్‌నెస్, డ్యాన్స్‌కు ఫిదా కాని వారుండరు. యాక్టింగ్‌లో తనకు తానే సాటి అనిపించుకున్న తన డ్యాన్స్ మూవ్స్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. కింగ్ ఖాన్ షారుఖ్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నటులను సైతం తన స్టెప్స్‌తో వావ్ అనిపించిన హృతిక్.. ఆ స్టెప్స్ క్రియేట్ చేసే కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్స్‌కు అండగా నిలిచాడు.

కరోనా మహమ్మారి ప్రభావంతో ఉపాధి లేక, కనీస భోజనం లేకుండా బాధపడుతున్న డ్యాన్సర్స్‌కు సాయమందించారు. కొరియోగ్రఫర్ బోస్కో మార్టిస్.. ప్రస్తుతం డ్యాన్సర్ల పరిస్థితిని వివరించగా, నేరుగా 100 మంది డ్యాన్సర్ల అకౌంట్స్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడు హృతిక్. అంతేకాదు తమకు అభిమానులకు వారధిగా నిలిచే సినిమా ఫొటోగ్రాఫర్స్‌కు కూడా మనీ సెండ్ చేశాడు. దీంతో ఖుష్ అవుతున్న డ్యాన్సర్లు, ఫొటోగ్రాఫర్లు హృతిక్‌కు థాంక్స్ చెబుతూ.. ప్రశంసలతో ముంచెత్తారు.

Advertisement

Next Story