ఉస్మానియా ఘటనపై నివేదిక కోరిన హెచ్ఆర్‌సీ

by Shyam |
ఉస్మానియా ఘటనపై నివేదిక కోరిన హెచ్ఆర్‌సీ
X

దిశ, న్యూస్ బ్యూరో: ఉస్మానియా ఆస్పత్రిలోని దుర్భర పరిస్థితులపై మే 22 లోపు నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ శుక్రవారం ఆదేశించింది. ఉస్మానియా ఐసీయూ వార్డులోని పరిస్థితులపై అక్కడి వైద్యులు, సిబ్బంది అంతా సీరియస్‌గా లేరని ఎం. రాంచంద్రారెడ్డి ఎస్‌హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. ఐసీయూ వార్డులో పిల్లి తిరుగుతున్న వీడియోను కూడా ఫిర్యాదులో జతచేశారు. బెడ్స్‌పైన ఆహారం కోసం పిల్లి తిరుగుతుండగా.. అక్కడున్న పేషెంట్లు దాన్ని తరిమేందుకు ప్రయత్నిస్తుండటం ఆ వీడియోలో రికార్డయింది. ఆస్పత్రిలోని ప్రమాదకర స్థితిపై అక్కడి వైద్యులకు పట్టింపులేదని, పేషెంట్ల ప్రాణాలపై నిర్లక్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ నివేదికను సమర్పించాల్సిందిగా సూచించింది.

Tags: osmania Hospital incident, HRC, cat, patients, problems

Advertisement

Next Story

Most Viewed