ఖ‌మ్మం క‌లెక్ట‌ర్‌కు హెచ్చార్సీ నోటీసులు

by Sridhar Babu |   ( Updated:2020-08-21 08:20:15.0  )
ఖ‌మ్మం క‌లెక్ట‌ర్‌కు హెచ్చార్సీ నోటీసులు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లా ఆస్ప‌త్రి మార్చురీలో ఫ్రీజ‌ర్లు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో శ‌వాలు కుళ్లిపోతున్నాయంటూ ఓ పత్రిక‌లో క‌థ‌నం ప్ర‌చురితం కావ‌డంతో మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ స్పందించింది. సుమోటో కేసుగా స్వీక‌రించింది. గ‌త ప‌దిహేను రోజులుగా ఫ్రీజ‌ర్లు ప‌నిచేయ‌కుండా ఉండ‌టంపై హెచ్‌ఆర్సీ మండిప‌డింది.

వెంట‌నే ఫ్రీజ‌ర్ల‌కు మ‌ర‌మ్మ‌తులు జ‌రిగేలా చూడాల‌ని ఆదేశిస్తూనే, క‌లెక్ట‌ర్ణ క‌ర్ణ‌న్‌తో పాటు ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. వ‌చ్చే నెల 18లోపు ఇద్ద‌రు అధికారులు వివ‌ర‌ణాత్మ‌కంగా నివేదిక అంద‌జేయాల‌ని నోటీసుల్లో స్ప‌ష్టం చేసింది.

Advertisement

Next Story