- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిఫాల్ట్‌గా జీవిస్తే ప్రతిస్పందన తప్ప ఫలితం శూన్యం
దిశ, ఫీచర్స్ : మొబైల్‌లో కొన్ని డిఫాల్ట్ ఫీచర్స్ ఉంటాయి కానీ వాటితోనే మనం సంతృప్తి చెందుతామా? లేదు కదా! అదేవిధంగా జీవితాన్ని కూడా డిఫాల్ట్‌గా లీడ్ చేయడం మొదలుపెడితే జరుగుతున్న విషయాల పట్ల ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది. లైఫ్‌లో జరిగే విషయాలపై నియంత్రణ కోల్పోయి గుడ్డిగా ప్రయాణిస్తూ వెళ్లిపోతాం అంతే. అలాకాకుండా జీవితంలో మార్పు కోరుకుంటున్నారా? డిఫాల్ట్ లైఫ్ కాకుండా జీవితాన్ని నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? చుట్టూ ఉన్న చాలా విషయాలతో సంతోషంగా ఉన్నప్పటికీ అంతకుమించి ఏదో ప్రయత్నించాలని భావిస్తున్నారా? అది అసాధ్యమైతే కాదు కానీ కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలోనే పెద్దపెద్ద కలలు, జీవనశైలిలో అతి పెద్ద మార్పులు కూడా జరగవచ్చని గ్రహించడం ముఖ్యం. అందుకు తగ్గట్లుగా ‘లైఫ్ డిజైన్’ చేసుకోవాలి. అది ఎలా ఉండాలి? అందుకోసం ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ-మెయిల్‌ని తనిఖీ చేయడం లేదా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను స్క్రోల్ చేయడం వల్ల జీవితం అంగుళం కూడా ముందుకు కదలదు. జీవితంలో లక్ష్యాలను కలిగి ఉంటే, వాటిని చేరుకోవడానికి ప్రతీరోజు నిర్దిష్ట కార్యకలాపాలను నిర్ణయించుకోవాలి. వాటిని నిజం చేసుకునేందుకు తగిన అలవాట్లను అలవరుచుకుంటూ, మార్గాలను అన్వేషించాలి. మంచి అలవాట్లే భవిష్యత్తును నిర్ణయిస్తాయని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా నిత్యం రొటీన్‌గా గడుస్తుందంటే జీవితం డిఫాల్ట్‌గా గడిచిపోతోందని అర్థం.
సమయం నిర్ణయిస్తుందా?..
‘కాలం ఎవరి కోసం ఆగదు’ అనే మాట అందరికీ తెలిసిందే. కానీ చాలా సార్లు మనం ఓ పని ప్రారంభించడానికి లేదా కలను కొనసాగించడానికి సమయంపై ఆధారపడతాం. ఉదాహరణకు.. చాలామంది మిలీనియల్స్ వ్యాపారం లేదా ఇంకేదైనా పని ప్రారంభించేందుకు తమకు తగిన వయసు లేదని వెనకడుగు వేస్తారు. అలానే మిడిల్ అండ్ ఎబౌ ఏజ్ పర్సన్స్ తమ అభిరుచిని కొనసాగించడానికి వయసైపోయిందని అక్కడే ఆగిపోతారు. ఇది పూర్తిగా తప్పని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూబర్స్‌లో ఒకరైన ర్యాన్ వయసు 11 ఏళ్లు. అంతెందుకు 90 ఏజ్‌లోనూ తొలిసారి వ్యాపారాన్ని మొదలుపెట్టి విజయవంతమైన వారున్నారు. ఇవన్నీ కట్టుబాట్లకు అతీతమైనవి. గిరిగీసుకుని కూర్చోవడం, ఎవరిపైనో నిందలు వేయడం, సమయాన్ని వృథా చేయడం మాని ముందుకు సాగాలి. ఏదైనా చేయడానికి తొందరపడొద్దు లేదా ఆలస్యం చేయొద్దనే మాటలోని వాస్తవాన్ని గ్రహించి, రియాలిటీని వెంటనే గుర్తించగలగాలి.
సెట్ ప్రోగ్రామ్ :
మన మనస్సు ఒక ప్రోగ్రామబుల్ కంప్యూటర్. ప్రపంచం గురించి అందులో ఫీడ్ చేసిందే బయటకు వస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో నింపే సందేశాల గురించి ఉద్దేశపూర్వకంగా లేకపోతే సిస్టమ్‌లో డిఫాల్ట్‌గా డిపాజిట్ చేసిన సందేశాలతోనే జీవిస్తుంటాం. ఈ సందేశాలు అనుకూలమైనవా? లేదా ప్రతికూలమైనవా? అన్నదే జీవితంలో ఫలితాలను నిర్ణయిస్తుంది. ఫీడ్‌బ్యాక్ నుంచి అందుకున్న ఆదేశాలను నెరవేర్చడానికి అవసరమైన వ్యక్తులు, సాధనాలు, వనరులను మన మెదడు కనుగొంటుంది. సరైన ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేస్తేనే మ్యాజిక్ జరుగుతుందని తెలుసుకోవాలి. అందుకే మీ జీవితానికి ఒక మిషన్ లేదా విజన్ కీలకం. మనం గేమ్ చేంజర్ అని విశ్వసిస్తే, ఆ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలి.
విజన్ వైపు
‘అమలు చేయని విజన్.. ఒక పగటి కల అయితే, విజన్ లేకుండా ఏదో ఒకటి అమలు చేయడం ఓ పీడకల’ అనే మాటల్లోని ఆంతర్యం గమనిస్తే తత్త్వం బోధపడుతుంది. కలలు, లక్ష్యాలు అభిరుచులను కలిగి ఉన్న వ్యక్తులతో ప్రపంచం నిండి ఉంది కానీ వాళ్లతో ఏం పని కాదు. ఎవరైతే కలల దిశగా సాగుతారో, లక్ష్యంపై దాడి చేయడం ప్రారంభిస్తారో వారికి ప్రపంచం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతుంది.
మైండ్‌ఫుల్‌నెస్
గతంలో ఏం జరగింది? లేదా భవిష్యత్తులో ఏం జరగబోతుంది? అనే విషయాల గురించి ఆందోళన చెందడానికి బదులు ప్రస్తుత క్షణాన్ని, జీవితాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యం. అంతేకాదు నచ్చని పనికి లేదా ఎవరికైనా నో చెప్పడానికి భయపడకండి. మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం పడకుండా లైఫ్ ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ వెల్‌బీయింగ్‌పై ఏదైనా చర్య ప్రభావం చూపితే, దాన్నుంచి బయటపడే ధైర్యాన్ని కలిగి ఉండాలి.
కోరికలను బిగ్గరగా చెప్పండి
జీవితాన్ని మార్చుకునే అవకాశమివ్వడానికి మనం చేయగలిగే అత్యుత్తమమైన పని.. కోరికలను బయటకు చెప్పడం. మనం ఏం సాధించాలనుకుంటున్నామో మనం గుర్తు చేసుకోవడమే కాకుండా చుట్టూ ఉన్నవారికి కూడా చెప్పడం ఉత్తమం.
వాల్యూ బ్లూ ప్రింట్
మనలో కొద్దిమందికి మన పేరు, ఎక్కడి నుంచి వచ్చాం? ఏం చదువుకున్నాం? ఏం చేస్తూ ఉంటామనే విషయాలు తెలుసు. అలా మిగతావారు లేదా సమాజం అనుకుంటున్న వెర్షన్ లేదా అంచనా వేసిన వెర్షన్ ఒకటి ఉంటుంది. కానీ మన వాల్యూ బ్లూప్రింట్‌ను గుర్తించగలగడం అనేది నిజమైన ట్రూ సెల్ఫ్ అన్‌లాక్ చేయడంలోనే ఉంటుంది.
విజయవంతం కావడానికి స్థిరంగా ఉండటంతో పాటు కార్యాచరణ, ఫలితాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. అప్పుడే జీవితంలో మార్పు జరిగిందా లేదా అని కచ్చితంగా గుర్తించవచ్చు. అయితే జీవితాన్ని డిఫాల్ట్ మోడ్ నుంచి బయటకు తీసుకురావడం ఒక్క రాత్రిలో జరగదు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ పాత, లోతుగా ఇంజెక్ట్ అయిన అలవాట్లను మార్చుకునేందుకు సమయం పడుతుంది. అయితే దీనికి సాధన అవసరం. బైక్ రైడింగ్ నేర్చుకునేందుకు రోజులు పడుతుంది కానీ ఆ తర్వాత డ్రైవ్ చేయడానికి అర సెకనే పడుతుంది. అలాగే కలల జీవితాన్ని రూపొందించుకునేందుకు నెలలు పట్టవచ్చు, కానీ జీవితాన్ని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకున్నాక అనుకున్నది సాధించేందుకు ఆలస్యం జరగదు.