కలబందతో చెమట దుర్వాసనకు చెక్..

by sudharani |   ( Updated:2021-06-11 02:52:01.0  )
కలబందతో చెమట దుర్వాసనకు చెక్..
X

దిశ, వెబ్ డెస్క్: ఎండాకాలం వచ్చేసింది. బయటకెళ్తే చాలు, కొంచెం ఎండ ఎక్కువైతే చాలు శరీరం చెమటలు కక్కడం సహజం. అయితే, ఆ తడిచిపోయిన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. దాన్ని నివారించేందుకు మార్కెట్‌లో వివిధ రకాల పౌడర్లు, డియాడెంట్లు ప్రజలు వాడుతున్నారు. కాని అవన్నీ రసాయనాలతో చేయబడినవి. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి కాకుండా ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పదార్థాలతో చెమటకు చెక్ పెట్టొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..

కలబంద గుజ్జు..ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. దీని గుజ్జు కొద్దిగా తీసుకుని దానికి తేనెను చేర్చి రెండింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చెమట బాగా వచ్చే శరీర ప్రదేశాల్లో అప్లై చేయాలి. అరగంట తర్వాత నీటితో శుభ్రం చేయాలి. అంతే చెమట వాసన నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు. అయితే, చెమట వాసన ఎక్కువగా ఉంటే శరీరతత్వం గలవాళ్లు రోజుకు రెండు, మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed