- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చలాన్లలో ఎన్ని వింతలో.. బైక్ నెంబర్లతో కార్లు!
దిశ,తెలంగాణ బ్యూరో : మీ పేరుపై వాహనం ఉందా?.. ఎక్కడికి వెళ్లకపోయినా పోలీసులు చలాన్ వేసినట్లు మెసేజ్ వస్తుందా? అయితే మీ వెహికిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ పై మరో వాహనం ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి. రోడ్డు నిబంధనలు పాటించకపోతే ఎప్పటికప్పుడు చలాన్‌లు విధిస్తుండటంతో వాటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు దొడ్డిదారి తొక్కుతున్నారు. ద్విచక్ర వాహనం, కారుకు ఒకే నెంబర్ ఉండటం, ఓల్డ్ కారు నెంబర్‌ని కొత్త కారుకు ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన రాజ్ కిరణ్ ఈ యేడాది జులైలో మారుతి వేగనార్ కారు కొన్నాడు. నగరంలో నిబంధనలు పాటిస్తూ వాహనం నడుపుతుండగా.. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా కారు నడిపినందుకు రూ.1035 ఫైన్ వేస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అవాక్కయిన రాజ్ కిరణ్ వెంటనే పోలీస్ వెబ్‌సైట్ ఈ-చలాన్‌లో చెక్ చేశాడు. అయితే నగరంలో తన కారు నెంబర్‌తో మరో కారు తిరుగుతుందని గుర్తించాడు. వెంటనే ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చారు. గతేడాదికి సంబంధించిన చలాన్‌ను రెండు నెలల కింద కొన్న కారుకు ఎలా వేస్తారని ప్రశ్నించగా.. మానవ తప్పిదం వల్లే అలా జరిగి ఉంటుందని పోలీసులు సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో ఇలా ఎన్నో వాహనాలు రోడ్డెక్కేస్తున్నట్లు తెలుస్తోంది. చలాన్‌ల నుంచి తప్పించుకోడానికి వేరే వాహనాల నెంబర్‌ని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా నెంబర్ సిరీస్‌లను తొలగిస్తూ వేరే వాహనాలకు చలాన్ వచ్చేలా చేస్తున్నారు. ఈ చర్యలతో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఓనర్లకు చలాన్లు రావడంతో చేసేదేమి లేక డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి కేసులను నగర పోలీసులు ఎన్నో గుర్తించారు. అంతేకాకుండా ఒకే నెంబర్ కలిగిన కారు, బైక్ ని గుర్తించి ట్విట్టర్లో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇందులో బైక్ సదాశివపేట్‌లో ఉండగా కారు హైదరాబాద్‌లో తిరుగుతోంది. ఈ-చలాన్‌లో చెక్ చేయగా ఆ నెంబర్ కారుదే అని తెలిసింది.
ఇలాంటి వాటిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. మీ వాహనం కాకపోయినా చలాన్ వస్తే వెంటనే సమాచారం ఇస్తే సంబంధిత వాహనాన్ని సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా, బాధితుడు రాజ్ కిరణ్ సమస్యపై రవాణా శాఖ అధికారులను అడగ్గా.. ‘‘ఒక వేళ వాహనం వేరే రాష్ట్రాలకు అమ్మినా సరే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ కారుకి మాత్రమే ఉండేలా నిబంధనలు ఉంటాయి. కొత్త కారుకూ అదే నెంబర్ ఇచ్చారో.. లేక తప్పుడు నెంబర్‌తో వాహనం తిరుగుతుందో గుర్తించాల్సిన ఉందని’’ చెప్పారు.