- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటివరకు తెలంగాణలో ఎంతమందికి వ్యాక్సిన్ వేశారంటే..?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా తెలంగాణలో ఈరోజు హెల్త్ కేర్ వర్కర్ల (హెచ్‌సీడబ్యూ)కు మొదటి డోస్ 213 మందికి వేయగా రెండవ డోస్ 123 మందికి వేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ)కు మొదటి డోస్ 2,876 మందికి వేయగా రెండవ డోస్ 61 మందికి వేశారు. 45 సంవత్సరాలు పైబడి వారికి మొదటి డోస్ 25,903 మందికి వేయగా, రెండవ డోస్ 10,540 మందికి వేశారు. ఇటీవలే 18 సంవత్సరాలు పైబడివారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో 18 సంవత్సరాలు నిండి వారికి మొదటి డోస్ వ్యాక్సిన్ మాత్రమే వేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు 18-44 సంవత్సరాల లోపు వయసు వారికి మొదటి డోసు 1,34,586 వేశారు.
ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం హెచ్‌సీడబ్యూ లకు మొదటి డోస్ 2,48,760 మందికి వేయగా, రెండవ డోస్ 1,90,771 మందికి వేశారు. ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ లకు మొదటి డోస్ 2,60,193 మందికి వేయగా, రెండవ డోస్ 98,963 మందికి వేశారు. 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి మొదటి డోస్ 41,41,094 మందికి వేయగా, రెండవ డోస్ 11,79,821 మందికి వేశారు. దీనితో పాటు 18-44 సంవత్సరాల లోపు వయసు వారికి మొదటి డోస్ 10,98,697 మందికి వేసినట్లు అధికారులు వెల్లడించారు.