- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షణాలు లేకున్నా కరోనా వ్యాప్తి… ఎన్ని రోజుల వరకు?
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చీ (ఐసీఎంఆర్) వారి లెక్కల ప్రకారం ఓ ఇద్దరు పేషెంట్లకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. కేవలం వారు పాజిటివ్ అవడమే కాకుండా వారికి తెలియకుండానే వారివల్ల ఇతరులకు కరోనా అంటుకుంది. దీంతో కొవిడ్ 19 మరింత భయాందోళనలు కలిగిస్తోంది. ఆరోగ్యంగా ఉన్న మనుషులను కూడా నమ్మేటట్టు లేదు.
కరోనా వైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాలు విభజించింది. లక్షణాలతో వ్యాప్తి, లక్షణాలకు ముందు వ్యాప్తి, లక్షణాలు లేకున్నా వ్యాప్తి. సాధారణంగా కరోనా వైరస్ ఇంక్యుబేషన్ కాలం 5 – 14 రోజులు. అంటే వ్యాధి లక్షణాలు కనిపించడానికి పట్టేకాలం. వ్యాధినిరోధక శక్తి ఎక్కువ ఉన్నవాళ్లలో ఈ లక్షణాలు లేటుగా కనిపిస్తాయి. అయితే కరోనా ఈ మూడు రకాలుగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఎవరైనా వ్యక్తి కరోనా పాజిటివ్ అని తేలితే… అతను కలిసిన వ్యక్తులను, తిరిగిన ప్రదేశాల్లో అందరినీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అందుకే గుంపుల్లో తిరగకుండా లాక్‌డౌన్ పాటించాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
Tags -corona, covid, asymptotic, asymptotic, pre asymptomatic, incubation