- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో.. పవర్‌పుల్ కశ్మీరీ బ్యాట్స్..
దిశ, ఫీచర్స్ : క్రికెట్‌ను మతంలా ప్రేమించే భారత్‌లో ఈ ఆటకు సంబంధించిన ఏ విషయమైనా హాట్ టాపిక్‌గానే నిలుస్తుంది. ప్రత్యేకించి టీ20 ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ ఆడే షాట్లపై క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి ఉంటుంది. కొందరు బుర్ర ఉపయోగించి భారీ షాట్లు ఆడగలిగితే.. మరికొందరు ప్లేయర్లు హ్యాండ్ పవర్‌తో బంతిని బాదుతారు. ఇందులో బ్యాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈ క్రమంలోనే కశ్మీర్‌కు చెందిన ‘GR8 స్పోర్ట్స్’ తయారుచేసిన హ్యాండ్ మేడ్ బ్యాట్లు తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టగా.. తన జర్నీ విశేషాలను కంపెనీ యజమాని ఫౌజుల్ కబీర్ పంచుకున్నాడు.
ఇటీవల దుబాయ్‌లో ముగిసిన ICC టీ20 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో GR8 బ్యాట్ అధికారికంగా కనిపించింది. పాపువా న్యూ గినియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నెదర్లాండ్‌తో పాటు శ్రీలంక, ఒమన్ మధ్య జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో ఇద్దరు ఒమనీ ఆటగాళ్లు నసీమ్ ఖుషీ, బిలాల్ ఖాన్ ఈ బ్యాట్లను ఉపయోగించారు. ఈ అచీవ్‌మెంట్‌ను ‘గర్వించదగిన క్షణం’గా పేర్కొన్న కబీర్.. ‘మాకు నైపుణ్యం, ఆర్ట్ టెక్నిక్ లేకపోవడంతో కాశ్మీర్ విల్లో (willow)బ్యాట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం చాలా కష్టమైంది. కానీ పట్టుదల, అంకితభావంతో కృషి చేయడం వల్లే ఇప్పుడు కశ్మీర్‌ను గర్వించేలా చేయగలిగాను’ అన్నారు. 2014లో వ్యాపారం ప్రారంభించిన కబీర్.. మీరట్‌లోని ప్రొఫెషనల్ క్రాఫ్టర్స్ దగ్గర మెళకువలు నేర్చుకుని క్వాలిటీ బ్యాట్లను తయారుచేయగలిగాడు. ఈ క్రమంలోనే తమ బ్యాట్ల వినియోగం కోసం బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ తదితర దేశాల క్రికెట్ బోర్డు అధికారులను కలిసినా.. చివరకు ఒమన్ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ బ్యాట్లకు గుర్తింపు తెచ్చాడు.
29 రకాల విల్లో (willow)స్పెసీస్..
కశ్మీర్‌లో విల్లో చెట్లకు సంబంధించి 29 రకాల స్పెసీస్ అందుబాటులో ఉండగా.. వీటిలో ‘సాలిక్స్ ఆల్బా కెరులియా’ రకంతో అత్యుత్తమ బ్యాట్లను తయారు చేస్తారు. కాగా ఈ చెట్లను బ్రిటీషర్లు 1918లో కశ్మీర్‌లో నాటారు. ఇక బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)తో పాటు ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆ దేశ క్రికెటర్ తైజుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్ సహా పలువురు ఇతర క్రికెటర్లు తన బ్యాట్‌ను ఉపయోగించినట్లు ‘ఖాన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్(కెఐఎస్)’ యజమాని ఫిర్దౌస్ తెలిపారు. ఇక తమ ప్లాంట్‌లో ఏడాదికి 25,000 బ్యాట్లను ఉత్పత్తి చేస్తున్నామని, భారత్‌లోని 99% మార్కెట్లు కశ్మీరీ విల్లోతో తయారు చేసిన బ్యాట్‌లనే ఇష్టపడతాయని JK స్పోర్ట్స్ చైర్మన్ అబ్దుల్ ఖయూమ్ దార్ తెలిపారు.
దక్షిణ కశ్మీర్‌లోని చిన్న గ్రామమైన హల్ముల్లాలో గల 200కు పైగా బ్యాట్ల తయారీ యూనిట్లపై 10,000 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఈ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు, ప్రపంచ స్థాయిలో ఈ ప్రాంతానికి చెందిన ఉత్పత్తిని గుర్తించేందుకు వీలుగా ప్రభుత్వం GI ట్యాగ్‌ను పరిశీలిస్తోంది.