సెలబ్రెటీలు ఇంట్లో ఏం చేస్తున్నారంటే!

by Shyam |
సెలబ్రెటీలు ఇంట్లో ఏం చేస్తున్నారంటే!
X

దిశ వెబ్ డెస్క్: సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు అంతా.. తమ తమ స్వీట్ హోమ్స్ లలో గడుపుతున్నారు. సెలబ్రెటీలు తమకు నచ్చిన పనులు చేసుకుంటూ.. లాక్ డౌన్ రోజులను లవ్లీగా మార్చుకుంటున్నారు. తాము చేసే పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. అభిమానులను ఖుషీ చేస్తున్నారు. సెలబ్రెటీలు ఏం చేస్తున్నారో ఓ లుక్ ఏద్దాం.

కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ కావడంతో.. సెలబ్రెటీలంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. స్టే హోం .. స్టే సేఫ్ అంటూ తమ అభిమానులకు సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు తాము ఇంట్లో ఏం చేస్తున్నది.. అప్ టూ డేట్ .. సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

గాజర్ హల్వా:

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే లాక్ డౌన్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. తనకు ఇష్టమైన పనులు చేసుకుంటూ.. క్వారంటైన్ రోజులను అందంగా మలుచుకుంటోంది. తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని తెలుసుకోవడానికి పూజ.. వంట గదిలో ప్రయోగాలు చేస్తోంది. తాజాగా క్యారెట్ తో హల్వా చేసి .. ఔరా అనిపించింది. ‘గాజర్ హల్వా’ టేస్ట్ చేయండంటూ.. తన అభిమానులతో ఫోటోను షేర్ చేసుకుంది. దీంతో పాటు తనకిష్టమైన గిటార్‌ నేర్చుకుంటున్నట్లు కూడా ఆమె వెల్లడించారు.

టీవీతో కాలక్షేపం:

లాక్‌డౌన్ కారణంగా హీరో మహేష్ బాబు ఇంట్లోనే హాయిగా రిలాక్స్ అవుతున్నాడు. సినిమా, సినిమాకు మధ్యలో పూర్తి టైమ్ ఇంటి సభ్యులతో గడిపే మహేష్.. క్వారంటైన్ టైమ్ లో కూడా.. తన ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. టీవీలో తనకు నచ్చిన ప్రోగ్రామ్‌లు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటోను మహేష్ బాబు సతీమణి నమ్రత.. తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అది కాస్త వైరల్ అయ్యింది. కొడుకు గౌతమ్ తో, కూతురు సితార తో హ్యాపీ గా గడిపేస్తున్నాడు మన టాలీవుడ్ హ్యండ్సమ్ హీరో.

జున్నుతో నాని:

నేచురల్ స్టార్ నాని కి షూటింగ్ లేదంటే చాలు.. ఇంట్లో వాలిపోతాడు. తనకు దొరికిన కాస్త సమయాన్ని కూడా తన కొడుకు జున్నుతో గడపాలని అనుకుంటాడు. అలాంటిది క్వారంటైన్ టైమ్ లో నాని ఇంట్లో ఏం చేస్తాడు.. హ్యాపీగా జున్నుతో ఆడుకుంటాడు. ఎస్ నాని, తన కొడుకు జున్నుతో లాక్ డౌన్ టైమ్ ను ఆస్వాదిస్తున్నాడు.

వంటగదిలో దీపికా:

బాలీవుడ్‌లో అత్యంత ఆదరణ పొందిన జంటలలో ఒకరైన దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ లు తమ సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల మనసులను గెలుచుకుంటుంటారు. లాక్డౌన్ నేపథ్యంలో వీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. వంటగదిలో ఉండే వంట సామాగ్రిపై లేబుల్స్ అతికించడం లాంటి పనులు చేస్తున్న వీడియోను ఇటీవలే దీపికా షేర్ చేసుకుంది. పనిలోపనిగా తన భర్త రణ్‌వీర్‌కు కూడా దీపిక లేబుల్ వేసేసింది. తన భర్త నుదిటిపై 'హజ్బెండ్' అనే లేబుల్ అతికించింది. అంతేకాదు.. గ్రీన్ చికెన్, సలాడ్, కేక్ లను ప్రిపేర్ చేసింది దీపికా. వాటిని తన అభిమానులతో ఇన్ స్టాలో పంచుకుంది.

లడ్డూ కావాలా నాయనా:

బాలీవుడ్ హీరోయిన్ మలైకా తన సమయాన్ని లడ్డులు తయారు చేయడానికి ఉపయోగించుకుంటుంది. ఇంట్లో తీరిగ్గా లడ్డుల తయారీ చేస్తూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

హీరో రాంచరణ్‌ భార్య ఉపాసన తాను పెంచుకుంటున్న డేజీ అనే గుర్రంతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠీలు ‘లయన్ కింగ్’ సినిమా చూస్తున్నట్లు తెలిపారు. యువ హీరోలు నిఖిల్, మంచు మనోజ్ కొత్త లుక ను ట్రై చేస్తున్నారు. నిఖిల్ ఇంట్లోనే వర్క్ వుట్లు చేస్తున్నాడు. యాంకర్ శ్రీముఖి దబ్ బిర్యానీ చేసింది. ఇలా సెలబ్రెటీలంతా సరదా సరదాగా తమ ఇంట్లో సేద తీరుతున్నారు. నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం ఇంట్లో పనులను తప్పని సరిగా చేస్తున్నారు. వంట చేయడం, వర్కవుట్‌లు, ఇంటిని శుభ్రపరచడం, నిద్రించడం, కుటుంబంతో గడపడం, ఇలాంటి పనులతో క్వారంటైన్ డేస్ ను .. సరదా సరదాగా గడిపేస్తున్నారు.

Tags: telugu cinema, tollywood, celebrities, mahesh babu, lockdown, pooja hegde, ram charan

Advertisement

Next Story

Most Viewed