ఆర్థిక మద్దతుతో హౌసింగ్ ఫైనాన్స్ రంగం మెరుగైన వృద్ధి!

by Harish |
ఆర్థిక మద్దతుతో హౌసింగ్ ఫైనాన్స్ రంగం మెరుగైన వృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక మద్దతుకు తోడు, అధిక డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 8-10 శాతం వృద్ధిని సాధించగలవని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. తొలి త్రైమాసికంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం వల్ల రుణాల మంజూరుతో పాటు వసూళ్ల సామర్థ్యం గణనీయంగా పడిపోవడంతో రంగం వృద్ధి క్షీణించింది. అయితే క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడంతో పరిస్థితులు సానుకూలంగా మారాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడటం, కరోనా వ్యాక్సిన్ పురోగతి కారణంగా డిమాండ్ పెరిగింది.

జూన్ చివరి నాటికి వసూళ్ల సామర్థ్యం పుంజుకుందని, సెప్టెంబర్ ముగిసే సమయానికి ఇది మరింత పెరిగిందని ఇక్రా తెలిపింది. గృహ రుణాలు, ఆస్తి రుణాలు, మార్ట్‌గేజ్ రుణాలు, నిర్మాణానికి సంబంధించిన రుణాలు సహా ఇతర రుణాలతో కలిపి హౌసింగ్ ఫైనాన్స్ రంగం విలువ ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.11 లక్షలకు చేరుకుందని ఇక్రా రేటింగ్స్ ఫైనాన్షియల్ విభాగం హెడ్, వైస్-ప్రెసిడెంట్ సచిన్ సచ్‌దేవ తెలిపారు. ఈ రంగం స్థూల నిరర్ధక ఆస్తులు ఈ ఏడాది మార్చి 31 నాటికి 2.9 శాతం నుంచి జూన్ 30 నాటికి 3.6 శాతానికి పెరిగాయని ఇక్రా వెల్లడించింది.

Advertisement

Next Story