కొవిడ్ అనుమ‌తులు లేని ఆసుపత్రులు సీజ్‌…

by Sridhar Babu |
కొవిడ్ అనుమ‌తులు లేని ఆసుపత్రులు సీజ్‌…
X

దిశ‌, ఖ‌మ్మం : ఖ‌మ్మం న‌గ‌రంలో టాస్క్‌ఫోర్స్ క‌మిటీలు ఆక‌స్మీక త‌నిఖీలు చేశాయి. కొవిడ్ అనుమ‌తులు లేకుండా క‌రోనా రోగుల‌కు చిక్సిత చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మెరుపు దాడులు చేసి మూడు ఆసుపత్రులను సీజ్ చేశారు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌, హైప‌వ‌ర్ క‌మిటీలు, జిల్లా వైద్యశాఖ అధికారులు సంయుక్తంగా త‌నిఖీలు నిర్వహించారు. న‌గ‌రంలోని ప్రశాంతి, న్యూహోప్, గ‌ణేష్ హాస్పట‌ల్స్ యాజ‌మాన్యాలు ప్రభుత్వం, జిల్లా వైద్యఆరోగ్య శాఖ‌ నుండి కొవిడ్ చిక్సితకు సంబంధించి ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండా క‌రోనా రోగుల‌కు చిక్సిత‌లు అందిస్తూ, వైద్యశాఖ సూచ‌న‌ల‌ను బేఖాత‌రు చేస్తూ, రోగుల‌ను నంచి అధిక బిల్లు వ‌సూళ్లకు పాల్పడుతున్న నేప‌థ్యంలో జిల్లా హై-ప‌వ‌ర్ క‌మిటీ అధికారులు దాడులు చేప‌ట్టారు. ఖ‌మ్మం జిల్లాలో కొవిడ్ చిక్సిత‌ను అందిస్తున్న హాస్పట‌ల్‌ను జిల్లా వైద్యశాఖ అధికారులు ఈ నెల 19న త‌నిఖీలు చేశారు.

అయితే ఖ‌మ్మం న‌గ‌రంలోని వైరా రోడ్డులో ఉన్న న్యూహోప్ హాస్పట‌ల్ అనుమ‌తులు లేకుండా రోగుల‌కు చిక్సిత చేస్తున్నార‌ని త‌నిఖీలో తేలింది. వైద్యశాఖ అధికారులు మొద‌టి ద‌ఫాగా డాక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. అయినా అధికారుల అదేశాలు పాటించ‌కుండా రోగుల‌కు చిక్సిత చేస్తున్నార‌ని స‌మాచారంతో ఆదివారం త‌నిఖీలు చేసి సీజ్ చేశారు. దీంతోపాటు ప్రశాంతి హాస్పట‌ల్‌కు కూడా 20 బెడ్స్ అనుమ‌తి ఉంటే 80 బెడ్స్ వేసి అనుమ‌తుల‌కు విరుద్ధంగా క‌రోనా రోగుల‌కు చిక్సిత చేస్తున్నార‌ని విచార‌ణ‌లో తెలడంతో అధికారులు సీజ్ చేశారు. అక్కడ ఉన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వైరా రోడ్డులో గల గ‌ణేష్ హాస్పట‌ల్‌కు రిజిస్టేష‌న్ లేకపోవడంతో పాటు కొవిడ్ అనుమ‌తులు లేకుండా రోగుల‌కు చిక్సిత‌ను చేస్తున్నారు.

దీంతో హైప‌వ‌ర్ క‌మిటీ అధికారులు ఆ హాస్పటల్‌ని కూడా సీజ్ చేశారు. రోగుల‌కు నాణ్యమైనా వైద్యాన్ని అందించాల‌ని, ప్రభుత్వం సూచించిన ధ‌ర‌లు పాటించాలన్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ మాల‌తీ మాట్లాడుతూ.. మాన‌వ‌తా దృక్ఫథంతో క‌రోనా రోగుల ప్రాణాల‌ను కాపాడాల‌ని, నియ‌మ‌నిబంధన‌లు ఉల్లంఘిస్తే చ‌ర్యలు త‌ప్పువని హెచ్చరించారు. ఈ త‌నిఖీల్లో జిల్లా హై-ప‌వ‌ర్ క‌మిటీ స‌భ్యులు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రామానుజం, డ్రగ్ ఇన్ స్పెక్టర్ సురేంద‌ర్‌, ఐఎంఏ సెక్రెట‌రీ డాక్టర్ ప్రదీప్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుబ్బారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed