Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (27-08-2024)

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 09:26:03.0  )
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (27-08-2024)
X

మేష రాశి: ఈ రోజు మేష రాశి వారు ఫైనాన్షియల్‌గా బెనిఫిట్స్ అండ్ మానసిక ఆనందాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌తో సరదాగా బయటికెళ్లేవారు ఎలాంటి అవరోధాలు ఎదుర్కోకుండా సంతోషాన్ని గడిపి ఇంటికెళ్తారు. ఇతరులు మీపై స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరుస్తారు. మీ భాగస్వామి మీ పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తారు. ఈ రోజు అన్ని లాభాలే చేకూరుతాయి.

వృషభ రాశి: ఆర్థికపరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ రాశివారు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాగే మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని తలదించుకునేలా చేస్తారు. దాహంతో కొట్టుమిట్టాడుతోన్న పక్షులకు నీరు అందించండి. దీంతో మీ పరిస్థితి మెరుగుపడుతుంది.

మిథున రాశి: ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఎదుర్కొటారు.. ఆర్థికపరమైన విషయాల్లో భాగస్వామితో గొడవ పడతారు. కుటుంబ వైద్య ఖర్చులు అరికట్టలేము. కానీ మీ ఒపికతో అన్నింటిని సరిచేసే గుణం మీలో ఉంటుంది. ఆఫీసులో మంచి గుర్తింపు పొందుతారు. పనులన్నీ చకాచకా పూర్తి చేస్తారు. ఈ రాశివారు వ్యాధుల బారి నుంచి బయటపడడానికి ఏడు ముఖి రుద్రాక్షను ధరించడం మేలు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి మనీ వాల్యూ బాగా తెలిసి ఉంటుంది. డబ్బును పోగు చేసి, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడతారు. సాయంత్రం మీ ఇంటి వద్ద రిలాక్స్ అవడానికి చుట్టాలు ప్రవాహంలాగా వస్తుంటారు. వృత్తిపరంగా కూడా లాభాలు పొందుతారు. కానీ పలు అనవసరమైన పనుల వల్ల మీ టైమ్ వేస్ట్ అవుతుంది.

సింహ రాశి: ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే సిగరెట్‌కు దూరంగా ఉండాలి. తెలియని వారి సలహాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజంతా ఎంతో సంతోషంగా గడుపుతారు. ఎవరూ ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు. ఎదుటివారిపై ప్రేమను కురుపిస్తారు. మీ భాగస్వామి నేడు మీతో చాలా ఇష్టంగా మాట్లాడుతారు.

కన్యా రాశి: ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడటం మేలు. ఫ్రెండ్స్‌ పట్ల గాఢమైన ప్రేమను చూపిస్తారు. ఆఫీసు నుంచి వచ్చాక మీరు మీకు నచ్చిన వర్క్ చేస్తుంటారు. దీంతో మీరు ఆనందాన్ని పొందుతారు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. మీ ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టాలంటే ఆపదలో ఉన్నవారికి దంపుడు బియ్యం దానం చేయండి.

తులా రాశి: మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ గా బాగానే ఉంటారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు. చిల్లర వ్యాపారులు, టోకు వ్యాపారులకు నేడు మంచి జరుగుతుంది. నిజమైన ప్రేమంటే ఏమిటో మీరు నేడు తెలుసుకుంటారు. మీరు ప్రతి రోజూ ప్రశాంతతను పొందాలంటే నుదుటపై ఎరుపు రంగు కుంకుమను పెట్టుకోండి.

వృశ్చిక రాశి: ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో ఎక్కవ సమయం గడపటానికి ప్రయత్నించాలి. ఖాళీగా ఉన్న టైంలో కొత్తగా ఆలోచించే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి టైమ్ వేస్ట్ చేయకండి. మీ ఇంట్లో అగరబత్తి వెలిగించండి. మీ లైఫ్‌లో అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సు రాశి: ఔట్ డోర్ క్రీడలు ఈ రాశివారిని ఆకట్టుకుంటాయి. ధ్యానం, యోగా చేయండి. ముందువెనక ఆలోచించకుండా కాస్ట్లీ ఐటెమ్స్ కొనడం ఆపేయండి. ఆర్థిక సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. డబ్బు ఎలా సంపాదించాలో కొత్త మార్గాలు వెతకండి. నేడు ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేస్తారు. అరటి చెట్టు మొక్కను మీ ఇంటి పరిసరాల్లో నాటినట్లైతే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.

మకర రాశి: చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం మానుకోండి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా మానేయండి. మీ స్నేహితులతో సాయంత్రం పూట సంతోషంగా గడపండి. ఈ రాశి వారు నేడు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీ భాగస్వామి ఎంతో ఎనర్జీగా, ప్రేమగా కనిపిస్తారు.

కుంభ రాశి: ఈ రోజు మీకు ఇష్టమైన పనుల్ని చేయండి. అవసరమైన వాటికోసం మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. మీ తల్లిండ్రలతో, మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడండి. మీరు మున్ముందు పలు సమస్యల్లో చిక్కుకుంటారు. అల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులు మీ భాగస్వామి మీకు గుర్తు చేస్తారు. మీ సమస్యలు తొలగిపోవాలంటే మీరు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి.

మీన రాశి: ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో బయటికెళ్లి గడపండి. మీలో ఉత్సాహం, ప్రేమ వచ్చినా ఎక్కువ కాలం నిలవదు. ఈ రోజు మీ జీవితం ఎంతో అద్భుతంగా కనిపిస్తంది. మీ వైవాహిక జీవితాన్ని బంధువులు తరచూ పాడు చేస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా మీ కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే పేద మహిళలకు సేవ చేయండి.

Advertisement

Next Story

Most Viewed