Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు

by Kavitha |   ( Updated:2024-08-07 23:00:32.0  )
Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు
X

మేష రాశి : ఈ రోజు మూతలేని ఆహార పదార్థాలను తినకండి. అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. కొన్ని అనివార్య కారణాలవలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురి అవుతారు. దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి: ఈరోజు మీయొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు. ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేరు. అలాగే ఈ రాశిగల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను చూస్తారు. అయినప్పటికీ మీరు విచారించాల్సిన పనిలేదు. మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితాలు అందుకుంటారు.

మిథున రాశి: మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది.

కర్కాటక రాశి: ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. పనిలో ఈ రోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది.

సింహ రాశి : కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళిక నుంచి, చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది.

కన్యా రాశి: ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేస్తారో వారు ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఐన వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. మీ కరకు ప్రవర్తన, నిక్కచ్చితనం, మీ ఇంటి వారిని, దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది. అలాగే సమయాన్ని సద్వినియోగించుట కొరకు పార్కుకు వెళతారు

తులా రాశి: మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలా చూసుకోండి. మీ ప్రియమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింప చేయండి. పనిలో మీరు గొప్ప లబ్దిని పొందుతారు. కొన్ని అనివార్య కారణాలవల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను, ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి. అలాగే అధిక వ్యయాన్ని నివారించండి. పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం పొందుతారు. మీ భాగస్వామి మీ గూర్చి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు.

ధనుస్సు రాశి : ఈరోజు,కొంతమంది వ్యాపారవేత్తలు వారిప్రాణస్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయట పడవచ్చు. ఇంట్లో ఏవైనా మార్పులు చేసేముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చును. ఈ రోజు మీ బంధువు, మిత్రుడు, లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు.

మకర రాశి: మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమంలో లీనమవడం వలన అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు.

కుంభ రాశి: ఈ రోజు మీరు డేట్‌కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. మహిళా సహ ఉద్యోగుల మీ పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో సహాయపడతారు. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతి ఎటువంటి ధోఖా ఉండదు. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించక పోతే చివరికి అంతా తలకిందులు కావచ్చు జాగ్రత్త.

మీన రాశి: మీరు ఈ రోజు ఆఫీసునుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రాశి వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపారాభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే ఈరోజు మీరు రాత్రిపూట గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడతారు. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి ఇదే మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశముంది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరోసారి ఆలోచించండి.

Advertisement

Next Story

Most Viewed