- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు
మేషరాశి : ఈరోజు మీరు పెట్టే పెట్టుబడులు మీకు భవిష్యత్తులో లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. మీ స్నేహితుడి సమస్యలు మీకు చాలా బాధను కలిగిస్తాయి. ఈరోజు మొత్తం మీకు అద్భుతంగా ఉంది. ఎవరైతే చాలా కాలంగా వివాహప్రయత్నాలు చేస్తున్నారో, వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు మీరు మీ ఆఫీసుల్లో పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. అలసటగా ఫీలవుతూ ఉంటారు.
వృషభ రాశి :ఇతరులతో సంతోషంగా మీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం మీకు ఏదో తెలియని భరోసాని ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రోజు ఈ రాశి వారి ప్రవర్తనతో కొత్త వారితో స్నేహం పెంచుకుంటారు. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం పెట్టడానికి మీకు ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. దీని వలన అందరూ లాభాలు పొందే అవకాశం ఉంది. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.
మిథున రాశి : ఈ రోజు ఈరాశి వారు ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే అధిక ఖర్చులతో ధనాన్ని కోల్పోతారు. నేడు వీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పెరగడం సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతాయి. ఇది కాస్త చిరాకును కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి : వైకల్యాన్ని అధిగమించడానికి మీకుగల అద్భుతమైన మేధాశక్తి సహాయ పడగలదు. సానుకూలమైన ఆలోచనలవలన మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడగలరు.ఈ రోజు విజయం మీ సొంతం. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారస్థులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి : ఈ రోజు ఈరాశి వారి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల్లో చిక్కుకోవడం వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు నేడు డబ్బు కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లేకపోతే ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు రూపొందించుకుని, పనులు ప్రారంభిస్తారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.
కన్యా రాశి :ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు,వారియొక్క సలహావలన మీరు మీఆర్థికస్థితి దృఢపరుచుకోగలరు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
తుల రాశి : ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వారసత్వం ద్వారా లబ్ధి పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. స్నేహితులను గానీ, బంధువులను కానీ నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు సఫలం అవుతాయి
వృశ్చిక రాశి :ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది.ఆఫీసులో ఈరోజు మీరు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
ధనస్సు రాశి : ఈ రోజు ఈరాశి వారు ఏదైనా కొత్త వ్యాపారంలో డబ్బును పెట్టుబడిగా పెట్టేముందు ఆలోచిచడం మంచిది. ఇతరులను సంప్రదించకుండా పెట్టుబడి పెట్టకండి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా బాగుంటుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
మకర రాశి :ఆర్థిక పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరు ఒత్తిడి తీసుకువస్తారు. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.
కుంభ రాశి : ఏదైన తెలివితక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి.నేడు మీకు ఆర్ధికంగా బాగా కలిసివస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కలిసి వస్తుంది.
మీన రాశి :మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే చేయమని వత్తిడికి గురి చేస్తారు, అవిమీకు టెన్షన్ ని, వణుకుని కలిగించవచ్చును. అనవసర ఖర్చులు పెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది. ఈరోజు మీకు ఈవిషయము బాగా అర్ధం అవుతుంది.సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
- Tags
- Today