నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని లాభాలు

by samatah |   ( Updated:2023-02-28 03:56:36.0  )
నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని లాభాలు
X

మేష రాశి : ఆరోగ్య పరంగా మీకు ఈరోజు బాగుంటుంది.మానసికంగా ధృఢంగా ఉంటారు. ఈ రోజు మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ అనుకోని ఖర్చుల వలన అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అది కాస్త మిమ్ముల్ని బాధకు గురి చేస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసి వస్తుంది.

వృషభ రాశి : ఎప్పటి నుంచో నెరవేరాలి అనుకునే మీ కల నెరవేరడం మీకు పట్టలేనంత సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆఫీసులోని అన్ని విషయాలు మీకు ఈరోజు చాలా అద్భుతంగా మారుతాయి. స్నేహితులతో ఆనందగా గడుపుతారు. మఖ్యమైన పనులు నెరవేరుతాయి. వసూలు కానీ బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది.

మిథున రాశి : ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు గతంలో ఎవరి నుంచైనా అప్పు తీసుకుంటే అది ఈరోజు తప్పక చెల్లించాల్సి వస్తుంది. ఖర్చులు అధికం అవుతాయి. ఇతరులను విమర్శించే గుణం వలన మీరు విమర్శలకు గురి అవుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. చిన్ననాటి దూరపు స్నేహితుడిని కలుసుకోవడం సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఫలిస్తాయి.

కర్కాటక రాశి :ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. జీవితంలో అత్యుత్తమమైన రోజును మీరు ఈరోజు గడుపుతారు. పనులలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి : సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వస్తుంది. ఆఫీసులో పనులు త్వరగా పూర్తి చేసి ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. వివాహప్రయత్నాలు లాభిస్తాయి.

కన్యా రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది.ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. గతంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయం ఏర్పడవచ్చు. సమాజంలో గౌరవమర్యాదలు లాభిస్తాయి.

తుల రాశి :బయటి కార్యక్రమాల వంలన మీరు ఈరోజు కాస్త ఒత్తడి, అలసటకు లోనవుతారు. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. ఖర్చులు అధికం అవ్వడం కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

వృశ్చిక రాశి : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దాంపత్య జీవితానికి సంబంధించిన ఆనందం ఏదీ లేదంటూ ఈరోజు గుర్తిస్తారు. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. కమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : మీ స్వభావంతో మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్త వచ్చును. ఆర్థికంగా బాగున్నా, ఈరోజు చివర్లో మీరు డబ్బును పొదుపు చేయలేరు.కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. అభీష్టాలను నెరవేర్చుకుంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.

మకర రాశి : మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందగలరు ఎందుకంటే మీరుఇచిన అప్పు మీకు తిరిగివచ్చేస్తుంది. రోజు రెండవభాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈరోజు, గ్రహచలనం రీత్యా, ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తున్నది. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది.

కుంభ రాశి : మానసిక ఆరోగ్యంగా ఉంటారు. జీవితంలోని ప్రతీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. లేదంటే అది మీకు సమస్యలను తీసుకొస్తుంది. మీ కుటుంబంలోకి అనుకోని వ్యక్తులు రావడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మీన రాశి : శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అధికారుల ఆదరణ కోసం ప్రయత్నిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం అవసరం. ఉత్సాహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండడి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు వస్తాయి.

Also Read...

Telugu Panchangam 28 ఫిబ్రవరి : నేడు శుభ, అశుభ సమయాలివే!

Advertisement

Next Story