Today Horoscope in Telugu : ఈరోజు రాశిఫలాలు (19/07/2023)

by samatah |   ( Updated:2023-07-18 18:45:34.0  )
Today Horoscope in Telugu :  ఈరోజు రాశిఫలాలు (19/07/2023)
X

మేష రాశి: ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులన్నీ పూర్తి అవుతాయి. చిరకాలంగా ఎదురు చూస్తున్ మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధ్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్ప వచ్చు.

వృషభ రాశి : నేడు ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్ని విషయాల్లో మీ భాగస్వామి మీతో గొడవకు దిగే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత మీ చిన్ననాటి స్నేహితున్ని కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కానీ ఖర్చులను అదుపు చేసుకోవడం చాలా మంచిది.

మిథున రాశి :ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, మంచి జీతం ప్రారంభించడానికి మీకు ఇదే మంచి సమయం. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని కేటాయించడం అవసరం. ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

కర్కాటక రాశి :నిర్లిప్తతకు, నిస్పృహకు లోనుకాకండి. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీయొక్క సామానుపట్ల జాగ్రత్త అవసరము లేనిచోమీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు.మరీముఖ్యంగా మీయొక్క వాలెట్ ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి, ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి, ఒకసారి వినండీ. కొన్ని అనివార్య కారణములవలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురిఅవుతారు,దానిగురించి ఆలోచించి సమయాన్ని వృధాచేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనుంది.

సింహ రాశి : మీన రాశి :తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నపటికీ ,కొన్ని కారణాలవలన మీరు ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇదిమీకు ఇబ్బందిని కలిగిస్తుంది. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది.విద్యార్థులకు బాగుంటుంది. నేడు ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్యా రాశి : మిథున రాశి : ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు కాస్త ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు నేడు తమ కుంటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు నేడు అద్భుతంగా ఉంటుంది.

తుల రాశి : ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మలని నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. ఈరాశిలోఉన్న వివాహితులు వారిపనులనుపూర్తిచేసుకున్న తరువాత ఖాళి సమయాల్లో టీవీ చూడటము,ఫోనుతో కాలక్షేపం చేస్తారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు. మీభవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయం. ఆర్థికంగా బాగుంటుంది.

వృశ్చి రాశి : మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు.మీరు మీవ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. మీస్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు. ప్రతీ పనిలో ఈరోజు విజయం మీదే అవుతుంది. రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పని విషయంలో అన్ని అంశాలూ మీకు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

ధనస్సు రాశి : ఈరోజు ఈరాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది. చాలా కాలంగా ఎవరైతే రుణప్రయత్నం చేస్తున్నారో వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నేడు ఈరాశిలోని వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనుకోని వార్త మీ కుటంబాన్నంతటినీ చాలా సంతోషంలో ముచెత్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మకర రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. చిన్న వ్యాపారస్తులకు నేడు అధికంగా లాభాలు వస్తుంటాయి. ఉద్యోగస్తులు తమ ఆఫీసుల్లో ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు నూతనోత్సాహంతో పనిచేస్తారు. అధికారుల నుంచి మన్ననలు పొందుతారు.

కుంభ రాశి : ఈరోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంట్లోకి బంధువులు రావడం వలన సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే రుణప్రయత్నం చేస్తున్నారో, వారికి ఈరోజు రుణసదుపాయం కలిగే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి : ఈ రాశి వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. ఎవరైతే చాలా కాలంగా ఆఫీసు పనులు పెడింగ్ పెడుతారో నేడు అవన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.ఈ రాశి విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

Advertisement

Next Story