Telugu Rasi Phalalu :నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి కలిగే లాభాలు ఇవే

by sudharani |   ( Updated:2023-02-22 01:58:28.0  )
Telugu Rasi Phalalu :నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి కలిగే లాభాలు ఇవే
X

మేష రాశి: ఈ రాశి వారు ఉద్యోగం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఆఫీసు మారాలి అనుకునే వారు త్వరగా బయట పడింది. ఈ రోజు మీ బంధువుల దగ్గర నుండి వచ్చే సహాయంతో మీరు వ్యాపారం బాగా చేస్తారు. మీ భాగస్వామితో గొడవ జరుగుతున్నట్లుయితే ఒక మంచి పాత సన్నివేశాన్ని గుర్తుతెచ్చుకోండి. దాంతో మీ గొడవలు ముగిసిపోవచ్చు. ముఖ్యంగా మీ ప్రియమైన వారిపై సందేహం పడొద్దు. ఏదన్న ఉంటే డైరెక్ట్‌గా అడిగి క్లియర్ చేసుకోవడం మంచిది.

వృషభ రాశి: మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం లాంటి వాటితో సిద్ధపరచండి. ఎందుకంటే మీ మనసు ఎటువంటి భావోద్వేగానికి లేనైనా ఆటోమేటిక్‌గా సానుకూలంగా స్పందిస్తుంది. ఎప్పటి నుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు కావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. ప్రతీ పనులో మీకు సహకారాన్ని అందిస్తుంటారు. మీ జీవిత భాగస్వామిలో ఈ రోజు మీరు అద్భుతమైన కొత్త కోణాన్ని చూడబోతున్నారు. ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్‌గా ఫీలవుతారు. ఈ రోజు మీరు కొంచెం అసంతృప్తికి లోనవుతారు.

మిథున రాశి: ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు విషయంలో హితబోధ చేస్తారు. వాటిని శ్రద్ధతో వినడంతో పాటు ఆచరణలో పెట్టాలి. లేదంటే మీరు భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతిస్పష్టంగా ఉండడం అవసరం. వ్యాపార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ రోజు పని దినానికి కాస్త విశ్రాంతినిచ్చి.. మీ స్నేహితులతో ఎంజాయ్ చేయండి. మీ ప్రేమికుడు, ప్రేయసితో సరదాగా గడిపేందుకు ఈరోజు మంచి రోజు. ఒక వేళ మీకు వివాహం జరిగినట్లయితే.. మీ భాగస్వామితో ఈ రోజు మీకు ఎంతో అందంగా ఉండబోతుంది.

కర్కాటక రాశి: మీరు ఈ రోజు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అలాగే మీరు పొదుపు చేసుకున్న డబ్బులు మిమ్మల్ని కాపాడతాయి.. అదే సమయంలో అధిక ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి. మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ రెస్యూమ్ పంపడానికి లేదా ఇంటర్వ్యూకి వెళ్లేందుకు ఈ రోజు మంచి రోజు. తీరికలేని సమయం గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత మంచి సమయం దొరుకుతుంది. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు మీ టెన్షన్లకు కారణమవుతాయి. మీ భాగస్వామి ప్రేమ ఈ రోజు మీకు అత్యంత అద్భుతంగా కనడపడుతుంది. ఈ రోజు ఆమెతో కాస్త ఇంటి పనులు పంచుకోండి.

సింహ రాశి: ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. మీ మంచి ప్రవర్తనతో మీరు దూరమైన బంధాలు, కొత్త బంధాలు దగ్గరవుతాయి. మీ భాగస్వామి పవిత్ర ప్రేమను ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీ వైవాహిక జీవితం అత్యంత అద్భుతంగా మారనుంది. ఈరోజు మీరు చాలా ఖాళీగా ఉంటారు. మీకు నచ్చిన సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తారు. ప్రేమలో ఉంటే ఫీలింగ్ ఈ రోజు మీరు అనుభవించ బోతున్నారు.

కన్యా రాశి: ఉమ్మడి వ్యాపారాల్లో, కొత్త పథకాలల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు మీ ఆరోగ్యం సహకరించక పోవడంతో పనిమీద శ్రద్ధ పెట్టలేరు. మీ మంచి వ్యక్తిత్వం మీ చుట్టూ ఉన్నవారిని మెప్పిస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి నుంచి వచ్చే ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ముఖ్య పనులను చేసుకునేందుకు ఈరోజు మంచిది. మీరు ఉద్యోగం చేసే చోట ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈ రోజు ఎంతగానో దోహదపడతాయి. మీ దాంపత్య జీవితం ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంటుంది.

తుల రాశి: ఆర్థిక స్థితిగతులు మందగించి ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. మీకు కుటుంబంతోను, స్నేహితులతోను చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది. ఆఫీసులో మీరు చేసే పనుల వల్ల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఒకరి తగిన సమయం కేటాయిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.

వృశ్చిక రాశి: ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆఫీసులో ఉత్సహంగా పనిచేస్తారు. అంతులేని ప్రేమ పారవశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుల్ మూడ్ లో ఉంటారు.

ధనుస్సు రాశి: గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిపెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీరు చెప్పే విషయం మీ ప్రేయసిని విషాదంలో ముంచుతుంది. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది.

మకర రాశి: పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను,లాభాలను పొందుతారు. మీ భార్య గెలుపును మెచ్చుకొండి, విజయాలకు ఆనందించి, ప్రశంసించండి. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే, మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు,ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనుకోని ప్రయాణం కొంతమందికి వత్తిడిని కలిగిస్తుంది.

కుంభ రాశి: పిలవని అతిధి మీఇంటికి అతిధిగా వస్తారు. మీరు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి, మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు.

మీన రాశి: ఈ రోజు వీలైనంత రొమాంటిక్ గా చెయ్యడానికి ప్రయత్నించండి. ఈరోజు చేసిన మదుపు, బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది, కానీ భాగస్వాములనుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును. అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.

Advertisement

Next Story