Mars transit in Gemini: మిథున రాశిలో కుజుడు ప్రవేశం.. ఆ రాశులకు బ్యాడ్ టైం స్టార్ట్..

by Kavitha |
Mars transit  in Gemini: మిథున రాశిలో కుజుడు ప్రవేశం.. ఆ రాశులకు బ్యాడ్ టైం స్టార్ట్..
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక చోట నుంచి మరొక చోట ప్రవేశిస్తాయి. అలా మిథున రాశిలో కుజుడు సంచరించడం వలన కొన్ని రాశుల పై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎవరి జాతకంలో అయితే, కుజుడు బలంగా ఉంటాడో వారి జీవితంలో అన్ని సాధిస్తారు. అలా కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. అదే సమయంలో కొంతమంది జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం..

కర్కాటక రాశి

మిథున రాశిలో కుజుడు ప్రవేశం వలన ఈ రాశి వారికి కొత్త కష్టాలు వస్తాయి. అంతే కాకుండా ఈ కాలంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రమేయం లేకుండా ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. ఈ రాశి వారికి అంగారకుడి సంచారం చెడుగా ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టకండి.. మీకు అవసరం ఉన్నప్పుడు ఎవరూ ఇవ్వరు.

ధనస్సు రాశి

మిథున రాశిలో కుజుడు ప్రవేశం వలన ధనుస్సు రాశి వారికి బ్యాడ్ టైం మొదలవుతుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. కుజ సంచారం వల్ల ధనుస్సు రాశి అంత చెడే జరుగుతుంది. మీ చేతిలో ఉన్నా మీరు ఏమి చేయలేరు. పెళ్లి సంబంధం కూడా చెడిపోయే అవకాశం ఉంది. దీని వలన మీరు చాలా బాధ పడతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది

Advertisement

Next Story