ఏప్రిల్ 29న బృహస్పతి రాశి మార్పు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు

by Prasanna |
ఏప్రిల్ 29న బృహస్పతి రాశి మార్పు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు
X

దిశ, ఫీచర్స్: ఏప్రిల్ చివరిలో బృహస్పతి తన రాశిని మారుస్తాడు. ఇప్పటివరకు మేషరాశిలో ఉన్న గురువు ఏప్రిల్ 29న వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. పుష్కర కాలం తర్వాత దేవగురువు వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు. బృహస్పతి సాధారణంగా సంవత్సరానికి ఒకసారి తన రాశిని మారుస్తాడు. ఈ రాశి గురు మార్పు వలన ఈ రాశుల వారు ఆర్ధికంగా లాభ పడనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభం

వృషభ రాశి లోకి బృహస్పతి సంచారం చేయనున్నాడు. 12 సంవత్సరాల తర్వాత జరిగే ఈ సంచారానికి వలన ఈ రాశి వారు అనేక ప్రయోజనాలను పొందనున్నారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. అవివాహిత యువతులకు వివాహాలు జరుగుతాయి.

మకర రాశి

బృహస్పతి రాశిని మార్చడం వల్ల మకర రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. మీ పెళ్లి జరుగుతుంది. మీ ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది. ఏప్రిల్ 29 తర్వాత మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed