రేపటి నుంచి 25 రోజుల పాటు సంతోషంగా గడపనున్న రాశులు ఇవే!

by Jakkula Samataha |
రేపటి నుంచి 25 రోజుల పాటు సంతోషంగా గడపనున్న రాశులు ఇవే!
X

దిశ, ఫీచర్స్ : సింహ రాశిలోకి శుక్రుడు సంచరించనున్న కారణంగా రేపటి నుంచి 25 రోజుల పాటు మూడు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మేష రాశి : మేష రాశి వారికి శుక్రుడి సంచారం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి జాబ్ దొరికే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. చాలా సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి : ఈ రాశి వారికి శుక్ర సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది. రేపటి నుంచి 25 రోజుల పాటు చాలా ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఏ పని చేసినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. కుటుంబంలో శుభకార్యం జరగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయం ఇది.

తుల రాశి : శుక్రుడి సంచారం వలన తుల రాశిలోని ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. ఏ పని చేసినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. పెట్టుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

Advertisement

Next Story

Most Viewed