Shani Dev: శనిదేవుడి ఆశీస్సులతో ఆ రాశుల వారికీ గుడ్ డేస్.. మీ రాశి ఉందా?

by Prasanna |   ( Updated:2025-01-17 15:50:21.0  )
Shani Dev: శనిదేవుడి ఆశీస్సులతో ఆ రాశుల వారికీ గుడ్ డేస్.. మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : పుష్యమాసం శనీ దేవుడికి ( shani dev ) చాలా ఇష్టమని చెబుతుంటారు. ఈ మాసంలో శనీశ్వరుడికి పూజలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే, ప్రతి ఆదివారం కూడా సూర్యుదీని ఆరాధిస్తే.. దోషాలుండవని అంటున్నారు. మనలో చాలా మంది ఏలినాటి శనితో బాధపడుతుంటారు. కానీ, జీవితంలో మనం చేసుకున్న కర్మలను బట్టి శనీ దేవుడు ఫలితాలను ఇస్తుంటాడు. అందుకే, ఏ పని అయిన చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని పండితులు చెబుతుంటారు. ఉన్న ఫళంగా రెండు రాశులకు శనీ దేవుడు మంచి యోగాల్ని కల్గిస్తున్నాడు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తుల రాశి

ఈ రాశి వారికి శనీ దేవుడి అనుగ్రహం వల్ల ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఆగిపోయిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

మకర రాశి

శనీ దేవుడి అనుగ్రహం వలన ఈ రాశి వారు కోర్టు కేసుల నుంచి బయటపడతారు. మీ సోదరులతో మంచి బంధం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికీ డబ్బు విపరీతంగా వస్తుంది. మీ భార్యతరపు ఆస్తులు మీ పేరు మీదకు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ అనుకూలంగా ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement
Next Story

Most Viewed