Surya - Ketu: కన్యా రాశిలో సూర్య, కేతువు కలయిక.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు

by Prasanna |
Surya - Ketu: కన్యా రాశిలో సూర్య, కేతువు కలయిక.. ఆ రాశుల వారికి  డబ్బే డబ్బు
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. దీని ప్రభావం మనుషుల జీవితాల మీద పడుతుంది. ఇది కొందరికి శుభంగాను, మరికొందరికి అశుభం గానూ ఉంటుంది. సూర్యుడుని అధిపతిగా భావిస్తారు. అందుకే, జ్యోతిష్యులు కూడా ఉదయం లేవగానే సూర్యనమస్కారం చేస్తుంటారు. ప్రస్తుతం సూర్యుడు , సింహ రాశిలో ఉన్నాడు. కొద్దీ రోజుల్లో కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో కేతువు ఉన్నాడు. ఓకే సమయంలో సూర్యుడు, కేతువు కలవడంతో ఈ రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది. దాని వలన వారి సంపద కూడా పెరుగుతుంది. అయితే, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ధనస్సు రాశి

సూర్యుడు, కేతువు కలయిక వలన ధనుస్సు రాశి వారికి శుభంగా ఉండనుంది. మీరు చేసే కొన్ని పనుల వలన మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఇంత వరకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. కెరీర్‌ పరంగా మీరు కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు రావడంతో మీరు ఊహించని ధనం చూస్తారు.

సింహ రాశి

సూర్యుడు, కేతువు కలయిక వలన ఈ రాశి వారికి మంచిగా ఉండనుంది. దీని కారణంగా డబ్బు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే కొత్తగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది. కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు మీ ఇంట్లో వారికి చెప్పి చేయండి. పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తి చేస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed