- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డికి జాతకం సహకరించేనా..? శనిగ్రహం ప్రభావం ఎంత..? సీఎం జాతక చక్రం వైరల్ !!
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ నూతన సీఎంకు సంబంధించిన జాతక చక్రం ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన పదవిలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటారు..? ముఖ్యమంత్రిగా ఎన్నాళ్లు పని చేస్తారు..? రాబోయే రోజుల్లో జాతక చక్రం ఎలాంటి ప్రభావం చూపుతుంది తదితర విషయాలను తెలుసుకుందాం.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నవంబర్ 8, 1969న జన్మించారు. ఆయన పుట్టిన తేదీ ప్రకారం తులారాశి, చిత్త నక్షత్రంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి జన్మ జాతకం ప్రకారం బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నాడు. ఇలా ఉన్న వారి జాతకం అద్భుతంగా ఉండటంతోపాటు విశేష ప్రయోజనాలు ఉంటాయట. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడతారని జ్యోతిష్యం చెబుతోంది.
సీఎం పదవీ యోగానికి ఇదే కారణం..
తులారాశిని పాలించేది శుక్రుడు. శుక్రుడి అనుగ్రహం ఉన్నవారికి రాజయోగం వస్తుంది. దాని వల్లనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయం కూడా రేవంత్ రెడ్డి జాతకాన్ని మలుపు తిప్పేలా ఉంది. ఆ సమయంలో శని తన గృహమైన కుంభరాశిని సంచరిస్తాడు. ఇది జ్యోతిష్య శాస్త్రపరంగా ప్రభుత్వం యొక్క పారదర్శకత, వేగవంతమైన పనితీరును సూచిస్తుంది.
చిక్కంతా శనిగ్రహంతోనే..
రేవంత్ రెడ్డి జాతకం ప్రకారం నాల్గవ స్థానంలో కుజుడు, ఏడవ స్థానంలో శని ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. దీని వల్ల ఆయనకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కానీ తులారాశిలో బుధ, శుక్ర, చంద్ర, సూర్యుడి ప్రభావం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతమైన నాయకుడిగా ఎదుగుతాడని పేర్కొంటున్నారు.