- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిడ్ నుంచి కోలుకుని, కొత్త ఆశలు…
దిశ, వెబ్‌డెస్క్:
కొవిడ్ 19 మహమ్మారి ఎక్కువగా వృద్ధుల మీద ప్రభావం చూపిస్తుందని, దీని బారిన పడిన సీనియర్ సిటిజన్లు బతికి బయటపడటం అతి కష్టమని భావించిన వారున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా వయసు దాటిన వాళ్లు కూడా కొవిడ్ 19 నుంచి బయటపడి అందరికీ సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నారు. వారిలో మచ్చుకు కొందరి వివరాలు మీకోసం…
1. కేరళకు చెందిన వృద్ధ జంట థామస్, 93 ఏళ్లు, ఆయన భార్య మరియమ్మ, 88 ఏళ్ళు ఇద్దరికీ కరోనా సోకింది. ఈ వ్యాధి సోకిన సీనియర్ సిటిజన్లందరూ బతకడం కష్టం అనుకుంటున్న అరుదైన పరిస్థితుల్లో వీరిద్దరూ కోలుకుని ఒక ఆశను కలిగించారు.
2. రెండో ప్రపంచ యుద్ధ వెటెరన్ విలియం కెల్లీ. వయసు 95 సంవత్సరాలు. ఆయన జీవితంలో గ్రేట్ డిప్రెషన్ లాంటి పరిస్థితిని కూడా చూశాడు. అంతే ఉత్సాహం, పాజిటివ్ యాటిట్యూడ్‌తో కొవిడ్ 19ని కూడా జయించాడు. కిడ్నీ సమస్యలు, హృద్రోగ సమస్యలు, హైబీపీ ఉన్నప్పటికీ ఆయన ఈ వ్యాధి నుంచి బయటపడి అనారోగ్యంతో ఉన్న సీనియర్ సిటిజన్లకు ధైర్యాన్ని ఇస్తున్నాడు.
3. 1918 స్పానిష్ ఫ్లూ సమయంలో జన్మించిన 101 ఏళ్ల ఇటాలియన్ వ్యక్తి, రెండు ప్రపంచ యుద్ధాలను చవిచూశాడు. కరోనా దారుణంగా వ్యాపించి విజృంభణ సృష్టించిన ఇటలీ దేశంలో ఈ సీనియర్ సిటిజన్ కోలుకొని కొంత ఊరటను కలిగించాడు.
4. 104 సంవత్సరాల అడా జనుస్సోకు గతంలో స్పానిష్ ఫ్లూ నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు కరోనా నుంచి కూడా కోలుకున్నాడు. రెండు మహమ్మారి రోగాల నుంచి బయటపడి సంకల్పం గొప్పదని నిరూపించాడు. కష్టకాలంలో బతకాలన్న కోరిక ఉంటే ఎలాంటి రోగం ఏం చేయలేదని స్పష్టం చేశాడు.
5. వుహాన్‌కి చెందిన ఓ వందేళ్ల వ్యక్తి తన 100వ పుట్టినరోజుని కొవిడ్ 19 సోకిన తర్వాత జరుపుకున్నాడు. అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఈయనకు కొవిడ్ 19 నుంచి కోలుకున్న మరో వ్యక్తి నుంచి ప్లాస్మా తీసుకుని ప్లాస్మాదానం ట్రీట్‌మెంట్ చేయడం ద్వారా వ్యాధి నయమైంది.
6. ఎబోలా మందు ప్రయోగించడం వల్ల ఇటలీకి చెందిన 79 ఏళ్ల వ్యక్తి కొవిడ్ 19 నుంచి కోలుకున్నాడు. ఆవగింజంత అదృష్టం ఉంటే అనుకోకుండా చేసిన ప్రయోగం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని ఈయన నిరూపించాడు. ఈయన కోలుకున్నాక ఎబోలా మందు రెమ్డెసివిర్‌ను కొవిడ్ 19 క్లినికల్ ట్రయల్స్ కొరకు పంపించారు.
7. ఇక ఎలాంటి మందు ఉపయోగించకుండా కొవిడ్ 19 నుంచి బయటపడిన 107 ఏళ్ల డచ్ మహిళ కొర్నెలియా రాస్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటి వరకు కొవిడ్ 19 నుంచి కోలుకున్న అతిపెద్ద వయస్కురాలిగా, అది కూడా ఎలాంటి మందు తీసుకోకుండా బయటపడిన వ్యక్తిగా ఆమె నిలిచారు.
Tags: corona, covid, lockdown, quarantine, elders, HOPE, wuhan, china, Italy