ఆ విమానాలపై హాంకాంగ్ నిషేధం

by Anukaran |   ( Updated:2020-08-19 06:05:46.0  )
ఆ విమానాలపై హాంకాంగ్ నిషేధం
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ వైమానిక సంస్థ ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ ఈ నెలాఖరు వరకు నిషేధం విధించింది. ఈ విమానాల్లో కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని పేర్కొంటూ ఆగస్టు 18 నుంచి 31 వరకు బ్యాన్ చేసింది. ఈ నిషేధాన్ని ఎయిర్ ఇండియా అధికారులు ధ్రువీకరించారు. వందే భారత్ మిషన్‌తోపాటు ఈ నెల 18,21,25,28వ తేదీల్లో స్పెషల్ ఫ్లైట్‌లు భారత్, హాంకాంగ్‌ల మధ్యసేవలు అందించాల్సి ఉంది. కానీ, ఆగస్టు 14న ఓ ఎయిర్ ఇండియా విమానంలో 11 మంది ప్రయాణికులకు హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చినట్టు హాంకాంగ్ అధికారి ఒకరు తెలిపారు.

ఒకే విమానంలో ఇంతమంది పాజిటివ్ తేలడంతో భారత ల్యాబ్ టెస్టులపై సందేహాలు వస్తున్నాయని వివరించారు. విమానాలపై నిషేధం తొలిగాక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎయిర్‌లైన్ చూసుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు. కాగా, భారత్ ఆరుదేశాలతో విమాన ప్రయాణాలను ప్రారంభించింది. అదీగాక మరో 13 దేశాలతో చర్చలు జరుపుతున్నదని కేంద్ర మంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హాంకాంగ్ నిర్ణయం ఈ దేశాలతో చేసుకున్న ఒప్పందాలపై ప్రభావం చూపించే అవకాశమున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed