రూ. 53,000కు పైగా పండుగ ఆఫర్లు ప్రకటించిన హోండా కార్స్

by Harish |
Honda-1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా బుధవారం పండుగ ఆఫర్లను ప్రకటించింది. సంస్థకు చెందిన అన్ని మోడళ్లపై ఈ నెలాఖరు వరకు రూ. 53,500 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా హోండా కంపెనీ అన్ని డీలర్‌షిప్‌ల వద్ద అక్టోబర్ 31వ తేదీ వరకు కార్ల కొనుగోలుపై ఈ ఆఫర్లను పొందవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ల రూపంలో నగదు తగ్గింపుతో పాటు, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను అందిస్తున్నట్టు పేర్కొంది. హోందా 5-జనరేషన్ సిటీ మోడల్ కారుపై అత్యధికంగా రూ. 53,500, 4-జనరేషన్ సిటీ కారుపై రూ. 22,000, అమేజ్ మోడల్ కారుపై రూ. 18,000 వరకు, డబ్ల్యూఆర్-వీ మోడల్‌పై రూ. 40,100, జాజ్ మోడల్‌పై రూ. 45,900 వరకు పండుగ ఆఫర్‌ను కంపెనీ ఇస్తోంది. ‘దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ఇవ్వాలని నిర్ణయించాం. వినియోగదారుల సెంటిమెంట్ ఇటీవల మెరుగ్గా ఉంది. అమ్మకాలు కూడా గణనీయంగా ఉన్నాయి. ప్రస్తుతం హోండా కార్లపై మార్కెట్లో మంచి గిరాకీని చూస్తూన్నామని, ఈ నేపథ్యంలోనే అన్ని కార్లపై ఈ ఆఫర్లు ఉంటాయని’ హోండా కార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ అన్నారు.

Advertisement

Next Story