- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్-6 ప్రమాణాలతో హోండా నుంచి కొత్తగా..
దిశ, వెబ్‌డెస్క్: హోండా కార్స్ ఇండియా భారత్ మార్కెట్లోకి ప్రీమియం సెడాన్ కారును గురువారం విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలు కలిగిన ఈ మోడల్ డీజిల్ వేరియంట్‌ను రూ. 20.74 లక్షల ధరతో ప్రవేశపెట్టింది. ఈ వేరియంట్ మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా తమకు డీజిల్ వెర్షన్లపై ఉన్న నిబద్ధతను నిరూపిస్తోందని కంపెనీ వెల్లడించింది. అయితే, హోండా సివిక్ మోడల్ పెట్రోల్ వేరియంట్‌ను 2019 మార్చిలో విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగంలో డీజిల్ వెర్షన్‌ను ఎంపిక చేసుకోవాలనుకునే వారికి కొత్త నిబంధనలతో ప్రవేశపెట్టిన డీజిల్ వాహనం మెరుగైన ఆప్షన్ అని కంపెనీ తెలిపింది. ఇక, ఈ కారు లీటర్ డీజిల్‌తో 23.9 కిలోమీటర్ల మైలీజీ ఇస్తుందని, 1.6 లీటర్ ఐ-డీటీఈసీ టర్బో ఇంజిన్‌ను కలిగి ఉందని హోండా ఇండియా పేర్కొంది. అలాగే, దీని ఇంజిన్ గరిష్టంగా 118 హార్స్ పవర్ వద్ద 4000 ఆర్‌పీఎం పవర్‌ను అందిస్తుందని తెలిపింది. కాగా, హోండా సివిక్ మోడల్‌లో వీఎక్స్ డీజిల్ వేరియంట్ ధర రూ. 20.74 లక్షలుగా నిర్ణయించామని, జెడ్ ఎక్స్ డీజిల్ వేరియంట్ రూ. 22.34 లక్షలుగా నిర్ణయించినట్టు హోండా ఇండియా వివరించింది.