- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శభాష్ పోలీస్.. వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన హోంగార్డు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే బుగ్గవంక పరివాహక ప్రాంతం శాస్త్రి నగర్ వద్ద వరద నీటిలో ఓ వృద్ధురాలు చిక్కుకుపోయింది. ఈ విషయం గమనించిన హోమ్ గార్డ్ రమేష్ (హెచ్.జి 208) సాహసోపేతంగా వెళ్లి నీటిలో చిక్కుకుపోయిన మహిళను ఎత్తుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మహిళతోపాటు భర్త కూడా ఉండటంతో అతడిని హోంగార్డు సురక్షితంగా రక్షించారు. అనంతరం వారిని ఆటోలో సహాయ శిబిరానికి పంపించారు. ఈ సందర్భంగా స్థానికులు..హోంగార్డు రమేశ్‌తో పాటు కడప జిల్లా పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అన్బురాజన్ హోంగార్డు రమేష్‌ను అభినందించారు.
Advertisement
Next Story