- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి సుచరిత
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో అత్యాచారానికి గురైన బాధితురాలిని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలు పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్న బాధితురాలని కలిసి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి ధైర్యం చెప్పి.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంశాఖ మంత్రి సుచరిత బాధితురాలికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఘటన హేయమైనదని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు పోలీసు బృందాలను నియమించామని.. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీతానగరం ఘటన దురదృష్టకరమని మంత్రి తానేటి వనిత చెప్పుకొచ్చారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షల పరిహారంతోపాటు స్త్రీ,శిశు సంక్షేమశాఖ నుంచి మరో రూ.50వేలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తేలిందని.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని మంత్రి తానేటి వనిత చెప్పారు. అలాగే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా బాధితురాలని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి ముఠాలు, అరాచక వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించేలా చూస్తామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.
- Tags
- rape
- sucharitha